లోకేష్‌ తీసిన డీఎస్సీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ | - | Sakshi
Sakshi News home page

లోకేష్‌ తీసిన డీఎస్సీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ

Aug 6 2026 2:08 AM | Updated on Aug 6 2026 2:08 AM

లోకేష్‌ తీసిన డీఎస్సీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ

2025 డీఎస్సీ మంత్రి లోకేష్‌ తీసిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ. ప్రారంభం నుంచి చివరి దాకా సస్పెన్స్‌పెట్టి కై ్లమాక్స్‌లో షాక్‌ ఇచ్చారు.దీంతో 600 మంది జీవితాలు నాశనమయ్యాయి. డీఎస్సీలో నాకు 70.6 మార్కులతో రెండో ర్యాంకు వచ్చింది. బీసీఈ కేటగిరిలో ఉద్యోగానికి ఎంపికై నట్టు ఆగస్టు 27న కాల్‌ లెటర్‌ వచ్చింది. వారంలో ఉద్యోగంలో జాయిన్‌ కావాలి అని శుభాకాంక్షలు తెలిపారు. రెండు వారాల తర్వాత రిజల్ట్‌ లిస్టులో పేరు లేదని అధికారులను కలిసి మొరపెట్టుకున్నా. 1:1 రేషియోలో అర్హులకే ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం నేను ఎంపికై నట్టు ఎందుకు చెప్పింది. నా పోస్టును ఎవరికో ఇచ్చి మెరిట్‌ను తొక్కేసి, రిజర్వేషన్‌కు ఉద్యోగం ఇచ్చారు. ఏడేళ్లు చిన్న బిడ్డ ఆలనా పాలనకు దూరమై చదివాను. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం..ఈ కోటాలో ఎంపికై న వ్యక్తి విద్యార్థులకు బయాలజీ బోధించగలరా, ఇలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చి పాఠశాలలకు పంపితే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి.

– ఎస్‌.షర్మిల, తురకపల్లి (మదనపల్లె)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement