నేను ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివితే అర్హున్ని కాదట. ఇంటర్లో ఫిజిక్స్ చేసిన వాళ్లు అర్హత ఉందంటే ఇంతకంటే దగా డీఎస్సీ మరొకటి లేదు. అర్హతలపై కోర్టును ఆశ్రయిస్తే కేసు కొట్టేశారు. పరీక్ష రాశాక న్యాయం జరుగుతుందనుకుంటే నార్మలైజేషన్ వల్ల అన్యాయం జరుగుతుందని తెలిసినా ప్రభుత్వం ముందుకే వెళ్లింది. టెట్, డీఎస్సీలో ఎన్నేసీ మార్కులు వచ్చాయో చెప్పరు. రెండు కలిపి మార్కులు చెప్పి ర్యాంకులు ఇచ్చారు. ఇప్పటివరకు జరిగిన డీఎస్సీల్లో 80 పైగా మార్కులు వచ్చిన వారి సంఖ్య 40కి దాటలేదు. ఈ డీఎస్సీలో 400 మందికి 80 మార్కులు ఎలా దాటాయో. మనోవేదనతో నాకు గుండెపోటు వచ్చి రెండు స్టెంట్లు వేశారు. తూతూ మాత్రంగా డీఎస్సీ నిర్వహించి కావాల్సిన వారికి పోస్టులు ఇచ్చేశారు. అర్హతలేని వారికి టీచర్ పోస్టులు ఇచ్చి విద్యావ్యవస్థను ఏం చేయాలని చూస్తున్నారు. – ఎస్.బయ్యారెడ్డి, డీఎస్సీ అభ్యర్థి, తుంగవారిపల్లె, (కురబలకోట)


