రోడ్డుప్రమాదంలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో మహిళ మృతి

Aug 6 2026 2:08 AM | Updated on Aug 6 2026 2:08 AM

పుంగనూరు : ద్విచక్రవాహనంలో వెళ్తున్న ఓ మహిళ నడిచి వెళ్తున్న మరో మహిళను ఢీకొనడంతో వాహనం నడుపుతున్న మహిళ మృతిచెందిన సంఘటన బుధవారం మధ్యాహ్నం మండలంలోని శాంతినగర్‌ వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఈడిగపల్లెకి చెందిన సుబ్బరాం కుమారై లక్ష్మీ(37), తన అక్క కుమారుడు సురేంద్ర (21)తో కలసి ద్విచక్రవాహనంలో పుంగనూరులో పని నిమిత్తం వస్తూ శాంతినగర్‌ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆగ్రామానికి చెందిన మీనా(35) రోడ్డు పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి ఢీకొని పక్కన ఉన్న ఇంటిలోనికి దూరి గోడను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో లక్ష్మీ తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందింది. మీనాకు తీవ్రంగా, సురేంద్రకు స్వల్పగాయాలయ్యాయి.. ఇరువురిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. మీన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఎస్‌ఐ అన్సర్‌బాషా కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement