పాఠశాలల్లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలి

Aug 6 2026 2:08 AM | Updated on Aug 6 2026 2:08 AM

మదనపల్లె సిటీ : ప్రతి పాఠశాలలో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్లును ఏర్పాటు చేయాలని డీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం స్కౌట్స్‌ ప్రవేశాల పోస్టర్లను ఆవిష్కరించారు. బాలురకు స్కౌట్స్‌ యూనిట్‌, బాలికలకు గైడ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలన్నారు. విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌లో పొందుపరిచిన క్యాలెండర్‌లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్‌ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

మార్చ్‌పాస్ట్‌కు 64 మంది ఎంపిక

స్వాతంత్య్ర దినోతవ్స వేడుకల సందర్భంగా మదనపల్లె పోలీసు పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి మార్చ్‌ పాస్ట్‌లో పాల్గొనే విద్యార్థుల ఎంపిక కార్యక్రమం కూడా నిర్వహించారు. 32 మంది స్కౌట్స్‌, 32 మంది గైడ్స్‌ ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి, అడ్వాన్స్‌డ్‌ స్కౌట్‌ మాస్టర్‌ నాగరాజు, మహమ్మద్‌ఖాన్‌, హర్షవర్ధన్‌రెడ్డి, ఎంఈఓ రెడ్డిశేఖర్‌, జిల్లా సైన్సు అధికారి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

జైలు భరో, ధర్నా జయప్రదం చేయండి

మదనపల్లె (కురబలకోట) : క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈనెల 10న నిర్వహించే జైలు భరో కార్యక్రమం, ఆగస్టు 18న జిల్లా కలెక్టరేట్‌ల వద్ద చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కేతారి రాధాకృష్ణ కోరారు. బుధవారం మదనపల్లెలో జరిగిన జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందన్నారు. వ్యవసాయ పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర హామీ, రైతులకు రుణమాఫీ, నాలుగు లేబర్‌ కోడ్‌ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేత, నిరుద్యోగులకు ఉపాధి,కూలి రేట్లు పెంపు వంటి ప్రధాన డిమాండ్లతో ఉద్యమాలు చేపడుతున్నట్లు తెలిపారు.ఆగస్టు 6 నుండి 9 వరకు జిల్లా వ్యాప్తంగా బైక్‌ జాతాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించి, ఈనెల 10న అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో జరిగే జైలు భరో కార్యక్రమంలో రైతులు, కార్మికులు, యువత, మహిళలు పాల్గొనాలని కోరారు. నాయకులు టి.కృష్ణప్ప, సాంబశివ, సలీంబాషా, సరేష్‌కుమార్‌, వేణుగోపాల్‌రెడ్డి, నరసింహులు, దేవా, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement