తమ్మునిపై అన్న దాడి | - | Sakshi
Sakshi News home page

తమ్మునిపై అన్న దాడి

Aug 6 2026 2:08 AM | Updated on Aug 6 2026 2:08 AM

మదనపల్లె టౌన్‌ : ఇంటి వివాదం తలెత్తి తమ్ముడిపై అన్న కరత్రో దాడి చేసిన సంఘటన బుధవారం కురబలకోట మండలంలో జరిగింది. ఘటనపై బాధితుడు ముదివేడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. మండలంలోని నల్లగుట్లపల్లి కు చెందిన శంకర (44) ఇంటిని అన్న ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య జరిగిన గొడవలో శంకర పై అన్న కరత్రో దాడి చేసి గాయపరిచాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పొలం వద్ద ఘర్షణ: వ్యక్తికి గాయాలు

మదనపల్లె టౌన్‌ : పొలం వద్ద చోటుచేసుకున్న ఘర్షణలో ప్రత్యర్థులు ఓ వ్యక్తి పై కర్రలతో దాడి చేశారు. ఘటనపై బాధితుడు గుర్రంకొండ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. గుర్రంకొండ మండలం, నడిమి కండ్రిగ పంచాయతీ, గరికుంటపల్లికి చెందిన బి . వెంకటేష్‌ (55) భూమిని అదే ఊరికి చెందిన ఓ వ్యక్తి బుధవారం కబ్జా చేయడానికి యత్నించడంతో వెంకటేష్‌ వెళ్లి అడ్డుకున్నాడు. దీంతో ప్రత్యర్థి వర్గంలోని ఓ వ్యక్తి కరత్రో వెంకటేష్‌ పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి వివరాలు ను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement