చిత్తూరు, నెల్లూరు జట్ల విజయం | - | Sakshi
Sakshi News home page

చిత్తూరు, నెల్లూరు జట్ల విజయం

Aug 6 2026 2:08 AM | Updated on Aug 6 2026 2:08 AM

వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్‌సీఎస్‌ క్రీడా మైదానంలో గ్రౌండ్‌–1లో అనంతపురం క్రికెట్‌ జట్టు, చిత్తూరు జట్టు తలపడ్డాయి. బ్యాటింగ్‌ చేపట్టిన అనంతపురం జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 219 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చిత్తూరు జట్టు 42.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చిత్తూరు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ శుభశ్రీ 126 బంతుల్లో 122 పరుగులు చేసింది. గ్రీష్మ 86 బంతుల్లో 58 పరుగులు చేసింది. అలాగే గ్రౌండ్‌ 2లో కడప, నెల్లూరు జిల్లాల జట్లు తలపడ్డాయి. నెల్లూరు జట్టు 50 ఓవర్లల్లో మూడు వికెట్లు కోల్పోయి 403 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన కడప జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేసింది. నెల్లూరు జట్టుకు చెందిన జెస్సికా 103 బంతుల్లో 107 పరుగులు మహాలక్ష్మి 121 బంతుల్లో 167 పరుగులు చేయడంతో నెల్లూరు జట్టు 203 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి, శ్రీధర్‌కుమార్‌, సునీల్‌ కుమార్‌, సతీష్‌యాదవ్‌, అనిత, మౌనిక, యామిని, శేఖర్‌, మాధవి, తదితరులు పాల్గొన్నారు.

167 పరుగులు చేసిన మహాలక్ష్మీ

107 పరుగులు చేసిన జెస్సికా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement