పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి | - | Sakshi
Sakshi News home page

పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

Aug 6 2026 2:08 AM | Updated on Aug 6 2026 2:08 AM

మదనపల్లె సిటీ : పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ సుబ్రమణ్యం అన్నారు. బుధవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లాలోని ప్రభుత్వ,ప్రైవేట్‌,ఇతర యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులు అందరూ ఉత్తీర్ణత సాధించే విధంగా ఇప్పటి నుంచి సన్నద్ధం చేయాలన్నారు. సీ,డీ గ్రేడ్‌ ఉన్న విద్యార్థులను గుర్తించాలన్నారు. వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మధ్యాహ్నభోజన పథకం సక్రమంగా అమలయ్యే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో డిసీఈబీ కార్యదర్వి గంగాధరం, జిల్లా సైన్సు అధికారి శ్రీధర్‌కుమార్‌, రాయచోటి డైట్‌ లెక్చరర్‌ నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యయుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ, మండలాల విద్యాశాఖ అఽధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement