రాయచోటి : మండల పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ బంగారువాండ్లపల్లి సమీపంలో మృతి చెందిన జింకను జిల్లా పశువైద్యాధికారి గుణశేఖర్ పిళ్‌లై మంగళవారం పరిశీలించారు. గ్రామ సమీపంలోని మామిడి తోటల్లో సంచరిస్తున్న జింకపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారుల సమాచారం మేరకు చిన్నమండెం పశువైద్యాధికారులు జింక మృతదేహానికి పంచనామా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నమండెం మండల పశువైద్యాధికారి డాక్టర్ గణేష్, పశు వైద్య సహాయకులు ఎ.సిద్దార్థ బాబు, పశు సంవర్థకశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
టిప్పర్‌ను ఢీకొన్న బొలెరో
ములకలచెరువు : ములకలచెరు వు నుంచి నలుగురు విద్యార్థులతో వెళ్తున్న బొలెరో వాహనం టైరు పగిలి.. ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం డ్రైవర్‌కు తీవ్ర గాయా లు కాగా మిగిలిన నలుగురు విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బయటపడ్డారు. ఈ సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... సత్యసాయి జిల్లా త నకల్లు మండలం నారేవాండ్లపల్లెకు చెందిన సో ముశేఖర్ తన బొలెరో వాహనంలో.. అదే గ్రామానికి చెందిన విద్యార్థులు శిరీషా, పల్లవి, రెడ్డిప్రసన్న, సులోచనతో ఇంటికి బయలుదేరారు. మండల సరిహద్దులోకి వెళ్లే సరికి బొలెరో టైరు పగిలి ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ సోముశేఖర్(25)కి తీవ్ర గాయాలయ్యాయి. స్థాని కులు గమనించి 108 సహాయంతో బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కారు షెడ్‌లో అగ్నిప్రమాదం
– రూ.7 లక్షల ఆస్తి నష్టం
మదనపల్లె టౌన్ : పట్టణంలోని నిమ్మనపల్లి రోడ్డులో గల నౌషాద్ కార్ మెకానిక్ షెడ్‌లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక అధికారి శివప్ప మంగళవారం మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నిమ్మనపల్లె రోడ్డు బసినికొండలో ఉన్న కార్ల షెడ్డులో.. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక కేంద్రాధికారి, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు మంటలను ఆర్పి వేశారు. అయితే అప్పటికే కార్ ఇంజన్లు, స్పేర్ పార్ట్స్, ఒక కారు పాక్షికంగా, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. షెడ్ యజమాని షేక్ నౌషాద్ మాట్లాడుతూ సుమారు రూ.7 లక్షల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


