అనంతపురం, నెల్లూరు జట్ల జయకేతనం | - | Sakshi
Sakshi News home page

అనంతపురం, నెల్లూరు జట్ల జయకేతనం

Aug 5 2026 1:59 AM | Updated on Aug 5 2026 1:59 AM

వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్‌సీఎస్‌ క్రీడా మైదానంలో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌, చిత్తూరు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్‌ జోన్‌ ఉమెన్స్‌ వన్‌డే క్రికెట్‌ అంతర్‌ జిల్లా పోటీల్లో భాగంగా మంగళవారం రెండు వన్‌డే మ్యాచ్‌ల్లో అనంతపురం, నెల్లూరు జిల్లాల క్రికెట్‌ జట్లు జయకేతనం ఎగురవేశాయి. గ్రౌండ్‌ 1లో నెల్లూరు, చిత్తూరు టీంలు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన చిత్తూరు జట్టు 47.4 ఓవర్లలో 252 పరుగులు చేసింది. అనంతరం నెల్లూరు జట్టు 49.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 253 పరుగులతో విజయాన్ని కై వసరం చేసుకుంది. ఇందులో నెల్లూరు జట్టుకు చెందిన సాయిలక్ష్మీ ఆల్‌రౌండర్‌గా 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు, 70 బంతుల్లో 69 పరుగులు చేసింది. ఇదే జట్టుకు చెందిన ఆలాసహార్‌ సైతం 122 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. గ్రౌండ్‌ 2లో కర్నూలు, అనంతపురం జిల్లా జట్లు తలపడ్డాయి. అనంతపురం జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టి 49 ఓవర్లలో 296 పరుగులు చేసింది. అనంతరం కర్నూలు జట్టు 49 ఓవర్లలో 214 పరుగులు చేసి ఓటమిపాలైంది. దీంతో 82 పరుగుల తేడాతో అనంతపురం జట్టు జయకేతనం ఎగురవేసింది. అనంతపురానికి చెందిన బ్యాట్స్‌మెన్‌ మహిత 80 బంతుల్లో 74 పరుగులు చేయగా ఇదే జట్టుకు చెందిన బౌలర్‌ తరన్నుమ్‌ బేగం 65 పరుగులు ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు తీసుకొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఈ పోటీలను శ్రీనివాసమూర్తి, శ్రీధర్‌ కుమార్‌, సతీష్‌యాదవ్‌, సునీల్‌ కుమార్‌, తదితరులు పర్యవేక్షించారు.

తరన్నుమ్‌ బేగం

(4 వికెట్లు)

మహిత

(74 పరుగులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement