మురికినీటి కాలువలు, పైపులైన్ పనులు చేపట్టాకే సదుం కాలేజీ మార్గంలో రోడ్డుపనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సదుం జడ్పీటీసీ సభ్యులు సోమశేఖర్ రెడ్డితో పాటు స్థానికులు పీజీఆర్‌ఎస్‌లో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ను కోరారు. కాలేజీ రోడ్డుకు ఇరువైపులా 400కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. ఈ మార్గంలో గుడి, బడి, జగనన్న కాలనీ, హాస్టల్, సీఎల్‌ఆర్సీ కార్యాలయం, వెలుగు, వ్యవసాయ, పాలిటెక్నిక్, ఆసుపత్రితో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయన్నారు. ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన రోడ్డుకు మురికినీటి కాలువలు, పైపులైన్ వేయకుండా రోడ్డు పనులు సాగిస్తే ఆతర్వాత మురికినీరు రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉందన్నారు. దీనిపై తగు చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరారు.


