బోయకొండకు పోటెత్తిన భక్తజనం | - | Sakshi
Sakshi News home page

బోయకొండకు పోటెత్తిన భక్తజనం

Aug 3 2026 3:39 AM | Updated on Aug 3 2026 3:39 AM

బోయకొండకు పోటెత్తిన భక్తజనం

చౌడేపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ ఆదివారం భక్తులతో కిటికిటలాడింది. వేకువజామునే ఆలయ అర్చకులు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, పంచామృతాలతో అభిషేకించారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రద్దీ కొనసాగింది. ఆదివారం సుమారు 50 వేల మందికి పైగా అమ్మవారిని దర్శించుకొన్నట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఆషాడమాసంలో కర్ణాటక భక్తులు అమ్మవారిని అత్యంత శుభకరమైన నెలగా భావించి వేల సంఖ్యలో తరలిరావడం గమనార్హం. ఈ సఽందర్భంగా అమ్మవారిని ఆలయ అర్చకులు సుందరంగా అలంకరణ చేసి దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది.

స్తంభించిన ట్రాఫిక్‌

వేలాది వాహనాలు బోయకొండకు తరలిరావడంతో ట్రాఫిక్‌ సమస్య నెలకొంది. ఎక్కడి వాహనాలు అక్కడే ముందస్తుగా సీఐ సాయిప్రసాద్‌ ఆదేశాలమేరకు ఎస్‌ఐ చిన్నరెడ్డప్ప, సిబ్బంది పర్యవేక్షించినా తిప్పలు తప్పలేదు. కొండపైకి వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనదారులు, భక్తులు అవస్థలు పడ్డారు. వివిధ సేవా టికెట్ల ద్వారా రూ. 24.10 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు.

వేలాది మందితో కిటకిటలాడిన ఆలయ పరిసరాలు

క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షణ

ఆలయ ఆదాయం రూ. 24.10 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement