నియామకం | - | Sakshi
Sakshi News home page

నియామకం

Jul 27 2026 1:36 AM | Updated on Jul 27 2026 1:36 AM

నియామకం గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు యువతి ఆత్మహత్యాయత్నం కూల్‌లిప్స్‌ విక్రేత అరెస్ట్‌

సాక్షి, మదనపల్లె : బి.కొత్తకోటకు చెందిన బీజేపీ నాయకులు కావడి రవీంద్ర ఆ పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన నియామకంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం రవీంద్రను బీజేపీ సీనియర్‌ నేతలు గోల్డెన్‌వ్యాలీ రమణారెడ్డి, గోపాల్‌రెడ్డిలు సత్కరించారు.

పీలేరు రూరల్‌ : గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో పోలీసు, రెవెన్యూ అధికారుల సూచనలతో వైద్యులు హరీష్‌కుమార్‌ పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మేము సైతం సమాజం కోసం స్వచ్ఛంద సంస్థ వారు దహనక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దీపిక, వీఆర్‌ఏ మల్లికార్జున, స్వచ్ఛంద సంస్థ సభ్యులు మోదీన్‌బాషా, రిజ్వాన్‌ తదితరులు పాల్గొన్నారు.

మదనపల్లె టౌన్‌ : కుటుంబ సమస్యలతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన ఆదివారం గుర్రంకొండ మండలంలో జరిగింది. కుటుంబీకుల కథనం మేరకు.. మండలంలోని ముట్టుకు చెందిన రోజా(25) కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపానికి గురైంది. జీవితంపై విరక్తి చెందిన ఆమె ఇంట్లో ఉన్న పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రులు బాధితురాలిని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా డాక్టర్లు మెరుగైన వైద్యం అందించడంతో కోలుకుంటూ ఉంది.

మదనపల్లె టౌన్‌ : మదనపల్లి పట్టణం ఎస్టేట్లో నిషేధిత కూల్‌ లిప్స్‌, గుట్కా, కై ని, పాన్‌ పరాగ్‌ వంటి మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టుకు సంబంధించి టూ టౌన్‌ ఎస్‌ఐ నాగేశ్వరావు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ వద్ద పెద్ద ఎత్తున కూల్‌ లిప్స్‌, గుట్కా, కై ని, పాన్‌ పరాగ్‌ వంటివి విక్రయిస్తున్నట్లు సీఐ మహమ్మద్‌ రఫీకి సమాచారం అందిందన్నారు. వెంటనే ఎస్‌ఐ నాగేశ్వరరావు, సిబ్బందితో వెళ్లి స్థానిక ఎస్టేట్‌లో కాపురం ఉంటున్న వాల్మీకిపురం మండలం సాకిరేవుపల్లికి చెందిన వారాదిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతడి ఇంట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న రూ.27 వేల విలువైన మూడు బస్తాలను సీజ్‌ చేసి, కేసు నమోదు అనంతరం అరెస్టు చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement