నందలూరు : సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు సాయిక్రిష్ణ, సునీల్‌కుమార్ నిర్వహించారు. అనంతరం స్వామివారు మోహినీఅలంకారంలో శేషవాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి సౌమ్యనాథ స్వామి శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై విహరించారు. గరుడసేవ తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ సౌమ్యనాథ స్వామి ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు.


