కార్మికుల సమస్యలపై పోరాటం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల సమస్యలపై పోరాటం

Apr 13 2026 7:32 AM | Updated on Apr 13 2026 7:32 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నర్సింగరావు పేర్కొన్నారు. ఆదివారం కడపలోని పాత రిమ్స్‌లో సీఐటీయూ 10వ జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .ఒకపక్క ప్రభుత్వంతోనూ మరోపక్క యాజమాన్యంతోను పోరాటం చేయడంలో సీఐటీయూ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.ప్రభుత్వాలు కార్మిక వర్గంపై దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. కార్మికులకు సరైన వేతనాలు ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. అధికారం రాకముందు ప్రస్తుత ఉన్నటువంటి పాలకులు కార్మిక వర్గానికి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి వ్యతిరేకంగా చేయడం దారుణమని ఘాటుగా విమర్శించారు. సీఐటీయూ 17 వ రాష్ట్ర మహాసభలు నంద్యాలలో 17, 18, 19 తేదీల్లో జరుగుతున్నాయని తెలిపారు. మొదటి రోజు జరిగే మహాసభలకు కడప జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement