నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
రాజంపేట రూరల్ : గ్రామాలలో అంతరాయంలేని నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే తమ లక్ష్యమని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సత్యరాజ్‌కుమార్ తెలిపారు. మండల పరిధిలో బ్రాహ్మణపల్లి 220 కేవీ సబ్ స్టేషన్‌ను శనివారం ఎస్‌ఈ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవిలో అంతరాయంలేని విద్యుత్‌ను అందించడం కోసం బ్రాహ్మణపల్లి సబ్‌స్టేషన్‌లో ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. 220 కేవీ సింగిల్ జీబ్రా బజ్‌ను ట్విన్ మౌజ్ బజ్‌గా ఆధునీకరిస్తున్నాన్నారు. అలాగే సీకే పల్లి– రేణిగుంట 220 కేవీ వనరులను రూపాంతరం చేస్తామన్నారు. ఆకేపాడు, వత్తలూరులో 33 కేవీ ఫీడర్లు నూతనంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఎస్‌ఈసీహెచ్ శ్రీరామచంద్రమూర్తి, ఈఈలు వెంకటేశ్వర్లు, రామిరెడ్డి, చంద్రశేఖర్, డీఈఈలు అచ్యుత్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య, సుబ్బారెడ్డి, గోవింద్, ఏఈఈలు దినేష్‌కుమార్, సురేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సత్యరాజ్‌కుమార్


