సర్టిఫికెట్ల కోసం కాళ్లరిగేలా తిరగాలి
తన కుమారుడు ఇంటర్ మీడియట్ పాసయ్యాడు. ఎంసెట్‌కు ధరఖాస్తు చేసుకుందామని గ్రామ సచివాలయం వద్దకు ఈబీసీ సర్టిఫికెట్ కోసం పలుమార్లు వెళ్లినా పనులు కాలేదు. ఉన్న డిజిటల్ అసిస్టెంటును జ్యోతి సచివాలయానికి డిప్టేషన్ వేశారు. జగనన్న పాలనలో సచివాలయం చుట్టూ తిరగకుండానే గ్రామ వలంటీర్ ఇంటికి వచ్చి ఆధార్, రేషన్ కార్డులు తీసుకెళ్లి వారే రెండు రోజుల్లో సర్టిఫికెట్లు ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. ఈ ప్రభుత్వంలో సర్టిఫికెట్ పొందాలంటే కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తుంది. – బండి లక్ష్మిదేవి, వంతాటిపల్లె, సిద్దవటం మండలం


