చెత్తకుప్పలో ప్రభుత్వ వైద్యశాల మందులు
నందలూరు : నందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం సమీపంలోని చెత్తకుప్పలో ప్రభు త్వ వైద్యశాలకు సంబంధించిన మాత్రలు శనివారం దర్శనమిచ్చాయి. ఇందులో కాలం చెల్లిన మాత్రలతో పాటు 2026 సంవత్సరం వరకు సమయం ఉన్న మాత్రలు కూడా ఉన్నాయి. రోగులకు అందాల్సిన మా త్రలు చెత్తకుప్పల పాలు కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ శరత్‌కమల్‌ని వివరణ కోరగా పీహెచ్‌సీలో గత మూడేళ్ల నుంచి ఉన్న స్టాక్‌ను పరిశీలించామని, అవి తమ పీహెచ్‌సీకి సంబంధించినవి కాదన్నారు. నందలూరు, నాగిరెడ్డిపల్లెకు సంబంధించిన సిబ్బందిని విచారించగా ఆ మందులు తమవి కాదని స్పష్టం చేశారన్నారు.
చెత్తకుప్పలో ప్రభుత్వ వైద్యశాల మందులు


