ఏదాడి అవుతున్నా..
గతంలో ఏటా 13,500 చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవి. ఈ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఏడాది అవుతున్నా ఇస్తామన్న రూ. 20 వేలలో నయాపైసా వేయలేదు. ఖరీఫ్ సాగుకు విత్తనాలు, ఎరువులు, దుక్కుల కోసం డబ్బులు లేక అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేసి నష్టపోయినా పంట నష్టం కూడా ఇప్పటికీ అందలేదు.తక్షణమే పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలి. –మట్లి రెడ్డయ్య, వడ్డిపల్లి,
కుర్నూతల గ్రామం, లక్కిరెడ్డిపల్లి మండలం
అన్నదాత సుఖీభవ ఏదీ?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని హామి ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా పథకం అమలు చేయలేదు. ఈ ఏడాదైనా పెట్టుబడి సహాయం కింద సుఖీభవ పథకం అమలు చేస్తే రైతులకు ఎంతో మేలు చేసిన వారవుతారు. పంటల సాగుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. పంటలు ఎలా సాగు చేయాలో దిక్కుతోచడం లేదు. – చిన్న వెంకట రమణారెడ్డి, రైతు,
గోపనపల్లె గ్రామం, గాలివీడు మండలం
రైతులకు సాగు కష్టాలు
రైతులకు మళ్లీ సాగు కష్టాలు దాపురించాయి. ఏడాది అవుతున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ. 20 వేల పెట్టుబడి సాయం ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీ ఎప్పుడు అమలవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. స్పష్టంగా ఇంత వరకు ఈ పథకానికి సంబంధించి తేదీని ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద యధావిధిగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతోంది.
–సానుగారి విశ్వనాథ రెడ్డి, ఓబులవారిపల్లి
ఏదాడి అవుతున్నా..
ఏదాడి అవుతున్నా..


