రైతులపై కూటమి సర్కార్ కపట ప్రేమ
రైతులపట్ల కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది.ఎన్నికలకు ముందు అన్నదాతకు అండగా ఉంటామని చెప్పింది.అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతోంది. విత్తనకాయలు కొనుగోలు చేయాలి.దుక్కులు చేసుకోవాలి.ఇందుకోసం అప్పు చేయాల్సి వస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామిని నిలబెట్టుకుని ప్రతి ఏడాది రైతుకు రూ.13,500లు అందజేశారు. కూటమి ప్రభుత్వం రైతులపట్ల నిర్లక్ష్యం చేస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం వెంటనే అమలు చేయాలి. –సుబ్బరాయుడు, రైతు, సంబేపల్లె మండలం


