మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డీడీగా శేఖర్‌ | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డీడీగా శేఖర్‌

Apr 19 2025 4:59 AM | Updated on Apr 19 2025 4:59 AM

మెడిక

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డీడీగా శేఖర్‌

కడప రూరల్‌: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం ఇన్‌చార్జి డిప్యూటీ డైరెక్టర్‌గా శేఖర్‌ నియమితులయ్యారు. ఈయన కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న భక్తవత్సలం పదోన్నతిపై ఏపీ రిక్రూట్‌మెంట్‌ బోర్డు జాయింట్‌ డైరెక్టర్‌గా వెళ్లారు. దీంతో ఈ స్థానంలోకి శేఖర్‌ వస్తున్నారు.

అంతర్జాతీయ

కవిసమ్మేళనానికి ఆహ్వానం

రాజంపేట: హైదరాబాదులోని చిక్కడపల్లి త్యాగరాయగానసభలో మే8న నిర్వహించే అంతర్జాతీయ కవిసమ్మేళనానికి అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకకు చెందిన కవి బాలరాజుజనార్ధనరాజుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణా తెలుగు భాష చైతన్యసమితి 12వవార్షికోత్సవం సందర్భంగా తెలుగుభాషకు పట్టాభిషేకం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఇందులో కవితా ధోరణి వినిపించడానికి అన్ని దేశాల్లోని తెలుగు కవులు వారి వారి పేర్లను నమోదు చేసుకునేందుకు ఆహ్వానం పంపినట్లు వివరించారు. కాగా జనార్ధనరాజు ఇప్పటికే మూడు కవి సమ్మేళనాల్లో పాల్గొని కవితలను వినిపించారు. బాలరాజు జనార్ధనరాజును తాళ్లపాకవాసులు అభినందించారు.

దంత సంరక్షణపై అవగాహన

కడప అర్బన్‌: వరల్డ్‌ ఓరల్‌ హెల్త్‌ డే మార్చి 20 సందర్భంగా డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నేషనల్‌ ఓరల్‌ హెల్త్‌ ప్రోగ్రాం వారిచే నిర్వహించే వివిధ నోటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో కడప ప్రభుత్వ దంత వైద్య కళాశాల వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. నెల రోజులు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా వాకతాన్‌ చేశారు. పుచ్చిన పళ్ల సమస్యలు, దంతాల సంరక్షణతోపాటు గుట్కా, కై ని, పొగాకు, మందు మొదలగునవి అరికట్టే విధానం ప్రాథమిక దశలో రోగనిర్ధారణ చేయగలిగిన పరికరాలు, నోటి క్యాన్సర్‌పై ప్రజలలో అవగాహన కల్పించారు. నోటి ఆరోగ్యం, శరీర ఆరోగ్యం ఎలా సంరక్షించుకోవాలో ముందుగా దంత వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వాళ్లకు వివిధ పోటీలు నిర్వహించారు. అందులో భాగంగా స్లోగన్‌, రైటింగ్‌, పెయింటింగ్‌, డెంటల్‌ ఫోటోగ్రఫీ నిర్వహించారు. ఏప్రిల్‌ 9న వాకతాన్‌ మహావీర్‌ సర్కిల్‌ నుంచి బస్టాండ్‌ వరకు సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో యూజీ, పిజి దంత వైద్య విద్యార్థులు, స్టాఫ్‌ పాల్గొన్నారు. ఏప్రిల్‌ 17న గ్రూప్‌ టూత్‌ బ్రెషింగ్‌ పద్ధతి, నోటి ఆరోగ్యం అవగాహన ప్రజల్లో దంత సంరక్షణ అవగాహన కల్పించారు.

మెడికల్‌ అండ్‌  హెల్త్‌ డీడీగా శేఖర్‌  1
1/1

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డీడీగా శేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement