విశాఖ జట్టు విజయభేరి
ప్రకాశం, చిత్తూరు జట్లకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
కడప స్పోర్ట్స్ : కడప నగరంలో నిర్వహిస్తున్న ఏసీఏ అండర్–14 అంతర్ జిల్లాల మల్టీడేస్ క్రికెట్ టోర్నమెంట్‌లో విశాఖ జట్టు విజయభేరి మోగించగా, ప్రకాశం, చిత్తూరు జట్లకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. వైఎస్‌ఆర్‌ఆర్–ఏసీఏ క్రికెట్ మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో 112 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన విశాఖ జట్టు రెండోరోజు మంగళవారం 68 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 426 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. జట్టులోని రామ్‌చరణ్ 133 పరుగులు, వినోద్ 177 పరుగులతో రాణించారు. పశ్చిమగోదావరి బౌలర్ మణివర్దన్ 2 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తూర్పుగోదావరి జట్టు 34 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ అయింది. విశాఖ బౌలర్లు ప్రఖ్యాత్ వర్మ 5 వికెట్లు, వినోద్ 2 వికెట్లు తీశారు. కాగా తూర్పుగోదావరి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో విశాఖ జట్టు ఇన్నింగ్స్ 117 పరుగుల ఆధిక్యంతో ఘన విజయం సాధించింది.
ప్రకాశం జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం..
కేఓఆర్‌ఎం మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో రెండోరోజు మంగళవారం బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. జట్టులోని సాయికృష్ణ చైతన్య 147 పరుగులు, హితేష్‌సాయి 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ప్రకాశం బౌలర్లు దినేష్ 3, లోకేష్ 3 వికెట్లు తీశారు. కాగా ప్రకాశం జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 405 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్ డ్రాగా ముగియగా, ప్రకాశం జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
చిత్తూరు జట్టుకు ఆధిక్యం..
కేఎస్‌ఆర్‌ఎం మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో 132 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన చిత్తూరు జట్టు 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. జట్టులోని శ్రీవంత్‌రెడ్డి 52, తనీశ్వర్ టెండూల్కర్ 54 పరుగులు, మణిదీప్ 72 పరుగులు చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పశ్చిమగోదావరి జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జట్టులోని నారాయణ 69, సుబ్బరాయుడు 42 పరుగులు చేశారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో పశ్చిమగోదావరి జట్టు 120 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిత్తూరు జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
విశాఖ జట్టు విజయభేరి
విశాఖ జట్టు విజయభేరి
విశాఖ జట్టు విజయభేరి


