రామోజీకి షాక్‌.. సుప్రీంకోర్టుకు యూరీ రెడ్డి | Yuri Reddy Petition In Supreme Court Over Margadarshi Case | Sakshi
Sakshi News home page

రామోజీకి షాక్‌.. సుప్రీంకోర్టుకు యూరీ రెడ్డి

Nov 4 2023 7:26 PM | Updated on Nov 4 2023 8:50 PM

Yuri Reddy Petition In Supreme Court Over Margadarshi Case - Sakshi

సాక్షి, అమరావతి: మార్గదర్శి విషయంలో ఈనాడు అధినేత రామోజీరావుకు మరోసారి షాక్‌ తగిలింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్గదర్శి విషయమై రామోజీరావుపై స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను యూరీ రెడ్డి దాఖలు చేశారు. 

అయితే, ఏపీ సీఐడీ విచారణపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఛాలెంజ్‌ చేస్తూ యూరీ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, మార్గదర్శిలో తన షేర్లను బలవంతంగా బదలాయింపు చేశారని యూరీ రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రామోజీరావు తనను తుపాకీతో బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారని యూరీ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, యూరీ రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. 

ఇది కూడా చదవండి: రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు: యూరీ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement