నేడు సుప్రీంకోర్టుకు వైఎస్సార్‌సీపీ | YSRCP to Supreme Court today | Sakshi
Sakshi News home page

నేడు సుప్రీంకోర్టుకు వైఎస్సార్‌సీపీ

Nov 1 2026 5:04 AM | Updated on Nov 1 2026 5:04 AM

YSRCP to Supreme Court today

పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని ఎస్‌ఈసీ 

శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోని వైనం 

అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించకపోవడంపై పిటిషన్‌  

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)ఘోర వైఫల్యంపై నేడు వైఎస్సార్‌సీపీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనుంది. నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకు ప్రశాంత వాతావరణం కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఎస్‌ఈసీ పట్టించుకోలేదు. శాంతి భద్రతలకు తీవ్రంగా విఘాతం కలుగుతున్నా, చూసిచూడనట్లు వ్యవహరిస్తూ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తోంది. నామినేషన్లు దాఖలు చేయనివ్వక పోవడం, ఏకంగా ఆర్వోల చేతుల్లోంచే పత్రాలు లాక్కోవడం.. ఇవన్నీ ఎదుర్కొని నామినేషన్‌ దాఖలు చేసిన చోట పోలింగ్‌ సజావుగా జరిగేలా ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. 

ఎన్నికలు జరిగే ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలింగ్‌ రోజు నిరంతర వెబ్‌ కాస్టింగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చినా.. ఆ దిశగా ఎస్‌ఈసీ చర్యలు తీసుకోలేదు. ఆదివారం మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో శనివారం రాత్రి పొద్దుపోయే సమయానికి కూడా చాలాచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. కొన్నిచోట్ల సీసీ కెమెరాలు మొక్కుబడిగా ఏర్పాటు చేసినా, వాటిని కంప్యూటర్లకు అనుసంధానం చేయలేదు. పైకి మాత్రం అన్నీ చేస్తున్నట్లు కలరింగ్‌ ఇస్తూ సుప్రీంకోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోంది. వీటన్నింటిపై నేడు వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement