సామాజిక జైత్ర యాత్ర.. హోరెత్తిన చెన్నూరు | Sakshi
Sakshi News home page

సామాజిక జైత్ర యాత్ర.. హోరెత్తిన చెన్నూరు

Published Sun, Dec 10 2023 5:13 PM

Ysrcp Samajika Sadhikara Bus Yatra In Kamalapuram Constituency - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కమలాపురం నియోజకవర్గం చెన్నూరులో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, యువనేత నరేన్ రామాంజులరెడ్డిల అధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రులు ఆదిమూలపు సురేష్, అంజాద్ బాషా,  మేరుగ నాగార్జున, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక,  ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ హాజరయ్యారు.

నమ్మి ఓటు వేసిందుకు సీఎం జగన్‌ ప్రభుత్వం సామాజిక సాధికారితకు కృషి చేసిందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. సీఎం జగన్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు టీడీపీ నేతలు పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్య వద్దన్నారు.. కానీ సీఎం ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకువచ్చారన్నారు. ‘‘నేను దళితుడిని.. నేను మంత్రినయ్యా. కడప నుంచి ఓ మైనార్టీని డిప్యూటీ సీఎంను చేశారు. కులం, మతం చూడకుండా అందరిని సీఎం జగన్ అభివృద్ది చేశారు. చంద్రబాబు మాత్రం కులాల మధ్య చిచ్చు పెట్టారు. కులాలను విడగొడితే వైఎస్సార్‌సీపీ ఓడిపొతుందని చంద్రబాబు అనుకుంటున్నారు’’ అని మంత్రి ఆదిమూలపు దుయ్యబట్టారు.

చంద్రబాబుకు ప్రజలు మళ్లీ బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ తెలంగాణలో నోటాతో పోటీ పడ్డారు. తెలుగు ప్రజలు బాబును, పవన్ కళ్యాణ్‌ను నమ్మడం లేదని ఆదిమూలపు అన్నారు.

చంద్రబాబును నమ్మొద్దు
ద‌ళితులుగా పుట్టాల‌ని ఎవ‌రైనా కోరుకుంటారా అంటూ దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు. అదే సీఎం జగన్ మాత్రం అందరిని అక్కున చేర్చుకున్నారు. చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై అధిక దాడులు జరిగాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చాలా తగ్గుముఖం పట్టాయి. ఎట్టి పరిస్దితుల్లో చంద్రబాబును నమ్మొద్దు
-మంత్రి మేరుగ నాగార్జున

Advertisement
 
Advertisement
 
Advertisement