వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర.. 21వ రోజు షెడ్యూల్‌ ఇదే.. | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర.. 21వ రోజు షెడ్యూల్‌ ఇదే..

Published Sat, Nov 25 2023 10:18 AM

Ysrcp Samajika Sadhikara Bus Yatra Day 21 Schedule - Sakshi

సాక్షి, అమరావతి: ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తోన్న మేలును వివరించడానికి వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శనివారం కాకినాడ జిల్లా తుని, అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గాల్లో జరగనుంది.  

అనకాపల్లి జిల్లా:
పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్ రాజు అధ్వర్యంలో జరగనున్న  బస్సు యాత్ర జరగనుంది. ఉదయం 10:30 గంటలకు జీవీఎంసీ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 11:30 గంటలకు వేపగుంట నుంచి పాలిటెక్నిక్ కాలేజీ వరకు భారీ ర్యాలీ జరపనున్నారు. 12 గంటలకు నూతనంగా ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవం అనంతరం 3 గంటలకు వెల్ఫే ర్ కాలేజీ నుంచి సబ్బవరం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సబ్బవరం జంక్షన్‌లో జరిగే బహిరంగ సభలో పార్టీ రీజనల్ ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులు హాజరుకానున్నారు.

కాకినాడ జిల్లా:
తునిలో ఎమ్మెల్యే మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తు‌ని ఆర్అండ్‌బి అతిథి గృహంలో వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజా మైదానంలో నిర్వహించే  బహిరంగ సభలో పార్టీ రీజనల్ ఇంఛార్జ్‌ పిల్లి సుభాస్ చంద్రబోస్, మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, మేరుగ నాగార్జున, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు హాజరుకానున్నారు.

 
Advertisement
 
Advertisement