సామాజిక న్యాయంలో సీఎం జగన్ దేశానికే ఆదర్శం: ఆర్‌.కృష్ణయ్య

Ysrcp R Krishnaiah Praised Cm Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్‌.. కుల గణన నిర్ణయం హర్షణీయం అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, దేశమంతా సీఎం జగన్ నిర్ణయాలను మెచ్చుకుంటున్నారని, రానున్న రోజుల్లో ఇంకా మరింత సంక్షేమం బీసీలకు అందుతుందన్నారు.

చరిత్రలో సీఎం జగన్ పేరు చిరస్థాయిగా ఉంటుంది. గుడిసెలో ఉండేవారు సైతం డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు. పిల్లల చదువులతో కుటుంబాల జీవితాలు మారిపోతున్నాయి. విదేశాలలో మన వాళ్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. జగన్ చేపట్టినన్ని సంస్కరణలు మరెవరూ చేయలేదు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. సరైన పదవులు కూడా ఇవకుండా మమ్మల్ని అవమానపరిచారు. ఏ రాష్ట్రం వెళ్లినా ఏపీ గురించి, సీఎం జగన్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు’’ అని కృష్ణయ్య పేర్కొన్నారు.

‘‘లోటు బడ్జెట్ ఉన్నా మెరుగైన సంక్షేమం అందిస్తున్నది జగన్ మాత్రమే. ఇతర నాయకులు జనాన్ని ఓటర్లుగా మాత్రమే చూస్తారు. జగన్ మాత్రమే తమ కుటుంబ సభ్యులుగా చూస్తారు. అందుకే వారందరికీ మేలు చేస్తున్నారు. కులాల లెక్కలు తీయటం వలన రిజర్వేషన్లు పెరుగుతాయి. పదవులు ఇంకా పెరుగుతాయి. బీసీల నాయకత్వం జగన్ హయాంలో బాగా పెరిగింది. కులాల లెక్కలు తీయటానికి పాలకులు భయపడతారు. కానీ సీఎం జగన్ ఎంతో ధైర్యంగా ఆ పని చేస్తున్నారు. 18 మంది‌కి ఎమ్మెల్సీలు ఇస్తే అందులో 11మంది బీసీలకే ఇచ్చారు. బస్సుయాత్రలకు జనం నుండి విశేష స్పందన లభిస్తోంది. బీసీల అభ్యున్నతికి జగన్ చేస్తున్న సహాయం మరువలేనిది’’ అంటూ కృష్ణయ్య కొనియాడారు.
చదవండి: ‘ఈసారి కూడా నా మనవడే సీఎం’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top