చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ ఎంపీలు

YSRCP MPs Fires On Chandrababu Naidu Over U Turn Politics - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నారా చంద్రబాబునాయుడు ద్వంద వైఖరిపై వైఎస్సార్సీపీ ఎంపీలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తూ, సిగ్గులేకుండా తన పార్టీ ఎంపీలను కేంద్ర హోం మంత్రితో భేటీకి పంపించారని విమర్శించారు. చంద్రబాబు వైఖరి అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. పూటకో పార్టీతో జతకట్టే చంద్రబాబు, కేసుల నుంచి తప్పించుకునేందుకు కేంద్రంతో తిరిగి దోస్తీ కట్టేందుకు తహతహలాడుతున్నాడన్నారు. చంద్రబాబు ఊసరవిల్లి వైఖరిపై పూర్తి అవగాహన కలిగిన బీజేపీ పెద్దలు, చంద్రబాబును నమ్మే స్థితిలో లేరన్నారు. గురువారం లోక్‌సభ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు ఎంపీలు మాట్లాడుతూ..

‘‘ గతంలో మోదీకి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలకు వెళ్లి  డబ్బులు సరఫరా చేసిన చంద్రబాబు..కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ పంచన చేరాలని ప్రయత్నిస్తున్నారు. మోదీ ఫ్యామిలీ గురించి చెడుగా మాట్లాడి, అమిత్ షా పై రాళ్లు వేయించిన చంద్రబాబు.. ఇప్పుడు రంగు మార్చి కాళ్ల బేరానికి వచ్చినట్లు నటిస్తున్నారు. ఓటు కు నోటు కేసులో చంద్రబాబుపై కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలి. ఈ కేసుకు సంబంధించి అమిత్ షాను కలిసి వీడియో సాక్షాలను అందిస్తాం ’’.. బాలశౌరి, వైఎస్సార్సీపీ ఎంపీ

‘‘ ఆలయాలపై దాడుల కేసుల్లో టీడీపీ నేతల ప్రమేయం ఉందని ఆధారాలతో సహ బహిర్గతమైంది. రాజమండ్రిలో బుచ్చయ్యచౌదరి అనుచరులు దేవాలయాన్ని ధ్వంసం చేశారు. టెక్కలి విగ్రహం ధ్వంసం కేసులో టీడీపీ నేతల నిర్వాకం సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. అమరావతిలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు. అడుగుకు పది వేల రూపాయల చొప్పున ఖర్చు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు కడతానని కేంద్రంతో ఒప్పందం చేసుకొని దోపిడీకి పాల్పడ్డారు. అధికారులను చంద్రబాబు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా స్థానిక ఎన్నికల్లో విజయం మాదే’’.. పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్సీపీ ఎంపీ

‘‘ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై చంద్రబాబునాయుడు అవాక్కులు చెవాక్కులు పేలారు. ప్యాకేజీల కోసం ఆయన ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేశారు. చంద్రబాబును ఢిల్లీలో యూటర్న్ బాబు అని పిలుస్తారు. రామతీర్థం సందర్శించేందుకు వెళ్లిన విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. విజయవాడలో టాయిలెట్ల కోసం గుడులు కూల్చారు. చంద్రబాబు పార్టీని ప్రజలంతా బహిష్కరించాలి’’.. మార్గని భరత్, వైఎస్సార్సీపీ ఎంపీ

‘‘అంతర్వేది ఘటనపై మా ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త రథాన్ని చేయించింది. సెక్యులరిజం కాపాడడమే మా ప్రభుత్వ లక్ష్యం’’.. చింతా అనురాధా, వైఎస్సార్సీపీ ఎంపీ 

‘‘కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్పంచ్‌లు గెలుస్తారు. చంద్రబాబు తొందర్లోనే జైలుకు పోతాడు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్‌దే విజయం’’..రెడ్డప్ప, వైఎస్సార్సీపీ ఎంపీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top