కమలాపురం.. జనసంద్రం | Ysrcp Bus Yatra Huge Success At Kamalapuram | Sakshi
Sakshi News home page

కమలాపురం.. జనసంద్రం

Dec 11 2023 4:30 AM | Updated on Dec 11 2023 4:30 AM

Ysrcp Bus Yatra Huge Success At Kamalapuram - Sakshi

వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గం చెన్నూరులో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం

సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన సామా­జిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పోటెత్తారు. చెన్నూరులో నిర్వహించిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలివచ్చారు. వివిధ గ్రామాల నుంచి డప్పుల దరువులు, ఆటపాటలతో ప్రజానీకం ర్యాలీగా ప్రాంగణం వద్దకు చేరుకు­న్నారు. ఇలా వేలాది మంది తరలి రావడంతో సభా­స్థలిలో అందరూ కూర్చునే పరిస్థితి లేకుండా పో­యిం­ది. వెరసి చెన్నూరులో ఎటు చూసినా, ఏ వీధిలో చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్‌­సీపీ జెండాలను రెపరెపలా­డిస్తూ కనిపించారు. కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్ర­నాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయ­కులు తమ ప్రసంగాల్లో సీఎం జగన్‌ పేరును ఉచ్ఛ­రించగా.. సభికులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.  

అంబేడ్కర్‌ ఆలోచన విధానాలు అమలు 
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, జ్యోతిరావ్‌ పూలే, కొమురం బీమ్‌ వంటి మహానీయుల ఆలోచనలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. అణగారిన వర్గాలకు అండగా, భావి తరాల ఉన్నతికి దూరదృష్టితో పెద్దపీట వేస్తున్న వైఎస్‌ జగన్‌ను మరోమారు మన కోసం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కామెడీ యాక్టర్‌ పవన్, నయవంచకుడు చంద్రబాబు కలిసికట్టుగా వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మొద్దని సూచించారు.   

సామాజిక సాధికారత మా విధానం : డిప్యూటీ సీఎం అంజద్‌బాషా
స్వతంత్ర భారతదేశంలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగానే మిగిలిపోయిందని, అయితే వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికారతను తన విధానంగా మార్చుకుందని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌బీ అంజాద్‌బాషా చెప్పారు. 2014–19 వరకు సాగిన టీడీపీ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకి కూడా మంత్రివర్గంలో స్థానం లభించలేదని, వైఎస్సార్‌సీపీ.. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా చేసిందని, మరో నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిందన్నారు. తనకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారని చెప్పారు. 

ఏపీలోనే సామాజిక విప్లవం: మంత్రి మేరుగు  
సామాజిక న్యాయం అనేది ఏపీలోనే, వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోనే సాకారమైందని సాంఘిన సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా బడుగులకు రావాల్సిన హక్కులు సంక్రమిస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో దళితులపై, బీసీలపై దాడులు చూశామని, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న నాడే చంద్రబాబు దళితద్రోహి అని తేలిపోయిందని, బీసీల తోకలు కత్తిరిస్తానన్న నాడే బీసీ వ్యతిరేకి అని వారు పసిగట్టారని చెప్పారు.  

సన్నిధి గొల్ల కొనసాగింపు: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
తిరుమల సన్నిధి గొల్లను తిరిగి కొనసాగించి రాష్ట్రంలోని యాదవుల ఆత్మగౌరవాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలిపారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. రాయలసీమలో తొలిసారి యాదవులకు ఎమ్మెల్సీ దక్కిందని, మేయర్‌ పదవులను యాదవులకు అప్పగించి గౌరవించిన చరిత్ర సీఎం జగన్‌దేనన్నారు. 

ఆచరణలో చూపిన సీఎం: ఎంపీ అవినాష్‌రెడ్డి
సామాజిక సాధికారిత కాగితాలకే పరిమితమ­య్యేదని.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే దానిని ఆచరణలో చూపారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి చెప్పారు. కేబినెట్‌ కూర్పు నుంచి నామినేటెడ్‌ పదవులు.. చివరకు ఆలయాల పాలక మండళ్లలో సైతం చిత్తశుద్ధి ప్రదర్శించారని కొనియా­డారు. బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం పాటించిన చరిత్ర జగనన్నదేనని మాజీ ఎంపీ బుట్టా రేణుకా అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రమేష్‌యాదవ్, రామచంద్రారెడ్డి, ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్‌ యానాదయ్య తదితరులు పాల్గొన్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement