చాపాడు(వైఎస్సార్ కడప జిల్లా): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ‘జగన్నాథుని జనయాత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేసిన విధానం, తీరుతెన్నులు, ప్రజలతో మమేకం, నవరత్నాల రూపకల్పన, అన్ని వర్గాల ప్రజల కోసం రూపొందించిన పథకాలు తదితర వివరాలతో మైదుకూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రాచమల్లు రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని రూపొందించారు. కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు.


