సాక్షి, తాడేపల్లి: భక్త కనకదాస జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘కులమత భేదాల గోడల్ని చెరిపేసిన భక్తి యోధుడు, శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు శ్రీ భక్త కనకదాస. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు ఆయన. ఎన్నో భక్తి కీర్తనలతో కవిత్వానికి కొత్త ఊపిరి పోశారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య ధైవంగా నిలిచిన శ్రీ భక్త కనకదాస జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో..
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా భక్త కనకదాస జయంతి నిర్వహించారు. కనకదాస చిత్ర పటానికి వైఎస్సార్‌సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, కుము-కురబ నేత గడ్డం రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.
కులమత భేదాల గోడల్ని చెరిపేసిన భక్తి యోధుడు, శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు శ్రీ భక్త కనకదాస. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు ఆయన. ఎన్నో భక్తి కీర్తనలతో కవిత్వానికి కొత్త ఊపిరి పోశారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య ధైవంగా నిలిచిన శ్రీ భక్త… pic.twitter.com/5y5o1f6IP7
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 8, 2025


