భారత సైన్యానికి అండగా ఉందాం.. జైహింద్: వైఎస్‌ జగన్‌ | YS Jagan Support To Indian Army Operation Sindoor Over Pahalgam Attack, Check His Tweet Inside | Sakshi
Sakshi News home page

Operation Sindoor: భారత సైన్యానికి అండగా ఉందాం.. జైహింద్: వైఎస్‌ జగన్‌

May 7 2025 7:48 AM | Updated on May 7 2025 10:16 AM

YS Jagan Support Over Operation Sindoor

వైఎస్‌ జగన్‌ ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, తాడేపల్లి: పాకిస్తాన్‌పై భారత్‌ దాడులు ఆపరేషన్‌ సిందూర్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.

ఆపరేషన్‌ సిందూర్‌పై వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తాం. జైహింద్’ అని పోస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement