
సాక్షి, తాడేపల్లి: హైదరాబాద్‌లోని రామంతాపూర్ విద్యుదాఘాతానికి గురై ఆరుగురు యువకులు మృతి చెందటంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకృష్ణాష్టమి ఊరేగింపులో దుర్ఘటన జరగటం విషాదకరం అని అన్నారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఈ ఘటనపై తాజాగా స్పందిస్తూ..‘పండగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.
