
తాడేపల్లి : రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఎల్లో మీడియా తప్పుడు కధనాలు రాయడంపై మాజీ ఆర్థికశాఖ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత బుగ్గన రాంజేంద్రనాథ్ మండిపడ్డారు. అంచనాలకు మించి జీఎస్టీ వసూళ్లు అంటూ రాసిన ఈనాడు కథనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాకపోయినా భారీగా వచ్చినట్లు రాయడంపై బుగ్గన ధ్వజమెత్తారు.
ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో రాష్ట్రానికి వచ్చిన వాస్తవ ఎస్ జీఎస్టీ ఆదాయం కేవలం రూ. 10, 769 కోట్లు మాత్రమేనన్నారు. కాగ్ నివేదికలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయన్నారు. పన్ను, పన్నేతర రూపాల్లో వచ్చే ఆదాయాలు భారీగా తగ్గాయన్నారు. ఆదాయం తగ్గినా భారీగా వచ్చినట్లు ఈనాడులో తప్పుడు కథనాలు రాశారన్నారు.