గుడివాడ:(కృష్ణాజిల్లా): జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో లింగవరం గ్రామ సభలో తెలుగు తమ్ముళ్ల కుమ్మలాడుకున్నారు. పాతకక్షల నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. లింగవరం గ్రామంలో పంచాయతీ చేపల చెరువులను గతంలో వేలం పాటలో దక్కించుకున్న మరో టీడీపీ వర్గానికి చెందిన కార్యకర్త పంజాల శ్రీనివాసరావు
చెరువును శుభ్రం చేసే విషయంలో గతంలో శ్రీనివాసరావు పై దాడి చేశారు తెలుగు తమ్ముళ్లు. తమకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని గ్రామ సభలో శ్రీనివాసరావు పై దాడికి దిగారు. చిరంజీవి రెడ్డి ,గోపాలస్వామి, మండపాటి శివయ్య నన్ను చంపడానికి ప్రయత్నించారన్న శ్రీనివాసరావు ఆరోపించాడు.
గత 20 సంవత్సరాల నుంచి లింగ వరం గ్రామంలో అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నానని తనపై దాడి చేశారని శ్రీనివాసరావు పేర్కొన్నాడు. మట్టి మాఫియాను అడ్డుకుంటున్నానని, దీనిపై అధికారులకు కంప్లైంట్ చేస్తున్నానని ఈరోజు తనపై ఏదో వంక పెట్టుకుని దాడికి దిగారన్నాడు. సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అక్కడ నుంచి పంపించేశారు గుడివాడ రూరల్ పోలీసులు.


