పులివెందులకు బయలుదేరిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Started To YSR Kadapa For Three Days Tour | Sakshi
Sakshi News home page

పులివెందులకు వైఎస్‌ జగన్‌.. ప్రజల సాదర స్వాగతం

Jun 22 2024 12:01 PM | Updated on Jun 22 2024 4:44 PM

YS Jagan Started To YSR Kadapa For Three Days Tour

Updates..

👉పులివెందులలో క్యాంప్‌ కార్యాలయానికి చేరుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

👉వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు

👉కడప నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల బయలుదేరిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. 

👉రోడ్డు మార్గంలో వెళ్తున్న జగనన్నకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రతీ గ్రామంలో బ్రహ్మరథం పడుతున్నారు. 

👉తనను అప్యాయంగా పలకరిస్తున్న ప్రజల కోసం తన వాహనాన్ని ఆపుతూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. 

👉జగన్నన రాక నేపథ్యంలో బాణాసంచా కాల్చుతూ సాదర స్వాగతం పలుకుతున్నారు. 

👉కడప చేరుకున్న వైఎస్‌ జగన్‌

 👉వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌ జిల్లా పర్యటనకు బయలుదేరారు. వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి కడపకు బయలుదేరారు. కడప నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్లనున్నారు. 

👉కాగా, వైఎస్‌ జగన్‌ మూడు రోజుల పాటు పులివెందుల పర్యటనలోనే ఉండనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఇక, గన్నవరం విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌ రాక సందర్భంగా జై జగన్‌ నినాదాలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement