సాక్షి, తాడేపల్లి: సీపీఎం నేత గఫూర్ కుమారుడు కిరణ్ మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఉన్నత విద్యను అభ్యసించి.. కాలిఫోర్నియాలో సీనియర్ డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తూ.. మంచి భవిష్యత్తు కలిగిన కిరణ్ అకాల మరణం అత్యంత బాధాకరమన్నారు.
కన్నకొడుకును కోల్పోయిన ఎం.ఎ. అబ్దుల్ గఫూర్, పి. నిర్మల గార్ల దుఃఖం వర్ణనాతీతం. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి, కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలన్న వైఎస్ జగన్.. కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. కిరణ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి: ఈసీకి వైఎస్సార్‌సీపీ 3 కీలక లేఖలు


