తాడేపల్లి: సాయికృష్ణ కేసుపై చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘చంద్రబాబూ.. సాయికృష్ణ చనిపోయాడా లేక బతికే ఉన్నాడా? ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే, ఆయన డెడ్ బాడీ ఎక్కడ ఉంది? నాలుగు రోజుల క్రితమే ఎఫ్‌ఐఆర్ నమోదైనా ఇప్పటికీ ఎవరినీ ఎందుకు అరెస్టు చేయలేదు?’’ అని నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్‌లో గాదె సాయికృష్ణ కేసు పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే. అతడి అదృశ్యంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కస్టడీలోకి తీసుకున్న తర్వాత అదృశ్యమయ్యాడు. పోలీసులు కస్టడీలో టార్చర్ చేసి హత్య చేసి, మృతదేహాన్ని మాయం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. సస్పెండ్ అయిన సీఐ నాగరాజుపై కేసు నమోదు చేశారు.
Mr. @ncbn Garu, is Sai Krishna dead or alive? If he is dead, where is his body? An FIR was registered four days ago. Why aren't any arrests made yet ?
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2026


