సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఒంగోలులో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి ఒంగోలు చేరుకుంటారు. అక్కడ ఇటీవల మరణించిన వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం వైఎస్ జగన్ తిరుగు ప్రయాణమవుతారు.


