యర్రగుడిపల్లెలో సీసీ రోడ్లను ప్రారంభించిన వైఎస్‌ జగన్‌ | Ys Jagan Inaugurates Cc Roads In Yerragudipalle Pulivendula | Sakshi
Sakshi News home page

యర్రగుడిపల్లెలో సీసీ రోడ్లను ప్రారంభించిన వైఎస్‌ జగన్‌

Jun 24 2026 5:09 PM | Updated on Jun 24 2026 5:53 PM

Ys Jagan Inaugurates Cc Roads In Yerragudipalle Pulivendula

సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మున్సిపాలిటీ యర్రగుడిపల్లెలో సీసీ రోడ్లను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిధులు రూ.1.5 కోట్లతో 3 సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది.

కాగా, ఈ పర్యటనలో భాగంగా అంతకుముందు వైఎస్‌ జగన్‌.. వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకోగానే అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం.. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. కలశ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, ఆలయంలో స్వామివారికి నిర్వహిస్తున్న సుదర్శన హోమంలోనూ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement