వస్తున్న వర్షాన్నో... వచ్చే వరదనో ఆపటం సాధ్యం కాకపోవచ్చు. కానీ ముందుగా తెలుసుకుని హెచ్చరించే వ్యవస్థలొచ్చాయి. వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగే సామర్థ్యం ఉండనే ఉంది. శిబిరాలకు చేరిన వారికి ఆహారం, నీళ్లు అందిస్తే చాలు. అప్పటికి వాళ్ల ప్రాణాలు కుదుటపడతాయి. వరద తగ్గాక మళ్లీ వారి జీవితాలు మొదలవుతాయి. ఈ ప్రక్రియలోనే వాళ్లకి ప్రభుత్వ అండ కావాలి. ముందుగా హెచ్చరించి... శిబిరాలకు తరలించి... సాయం అందించగలిగే యంత్రాంగం ప్రభుత్వానికే ఉంటుంది. ఆ బాధ్యత కూడా ప్రభుత్వానిదే.
గత జగన్ ప్రభుత్వ హయాంలో వలంటీర్ల వ్యవస్థ ఎలా పని చేసిందో చెప్పడానికి ఈ ఒక్క ఫోటోనే నిదర్శనం
నాడు జగన్ హయాంలో బాధితులకు పునరావాసం ఇలా..
రెండేళ్ల కిందట ఇదే స్థాయిలో వరదలు ఉభయగోదావరి జిల్లాలను ముంచెత్తినపుడు... నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏ ఒక్కరినీ కన్నీరు పెట్టనివ్వలేదు. ముందుగా హెచ్చరించి శిబిరాలకు తరలించడానికి, శిబిరాల వద్ద అప్పటికప్పుడు వండిన ఆహారం అందించడానికి వలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా అక్కరకొచ్చింది. ముఖ్యమంత్రి తన కార్యాలయం నుంచే ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు తగు ఆదేశాలివ్వటంతో సహాయ కార్యక్రమాలు పక్కాగా జరిగాయి. సహాయ కార్యక్రమాలకు అడ్డు రాకూడదన్న ఉద్దేశంతో నాలుగు రోజుల తరవాత పరిస్థితి ఉపశమించాక ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి వెళ్లారు. బాధితుల్లో ఏ ఒక్కరైనా ఫిర్యాదు చేస్తే ఒట్టు!!. అందరూ తమ తమ ఇళ్లకు వెళ్లేటపుడు చేతిలో రూ.2వేలు పెట్టి మరీ పంపింది నాటి ప్రభుత్వం.
నేడు బాబు హయాంలో... ఎక్కడన్నా..?
మరిప్పుడో..? ఇదేమీ అకస్మాత్తుగా పడిన వర్షాల వల్ల వచ్చిన ముప్పు కూడా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్నా... ఎగువ నుంచి వస్తున్న వరదను ప్రస్తుత చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో కృష్ణా నదికి ఉధృతంగా ప్రవాహం వచ్చి ఎగదన్నింది. దీంతో బుడమేరుకు పలు చోట్ల గండ్లు పడ్డాయి. ఇది చాలదన్నట్లు... ముందస్తు హెచ్చరికలు కూడా లేకుండా బుడమేరు గేట్లు ఎత్తేశారు.
దీంతో
విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు రూరల్ ప్రాంతాలూ దారుణంగా మునిగిపోయాయి. ఒక్కరినైనా ముందుగా హెచ్చరిస్తే ఒట్టు. ఇక శిబిరాలూ లేవు.. వాటికి తరలించటాలూ లేవు. సహాయ కార్యక్రమాల ఊసేలేదు. పైపెచ్చు కరకట్టపై కట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికే దిక్కులేదు. ఆ విషయం బయటపడకుండా ఆయన సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ పేరిట కలెక్టరేట్లో మకాం వేశారు. అక్కడికొక క్యారవాన్ తెప్పించుకుని... దాన్లోనే బస చేశారు. తన ఇల్లు మునుగుతోందన్న వార్తలపై అడ్డంగా దబాయిస్తూ... చరిత్రలో ఎన్నడూ ఎరుగని వర్షం వచ్చింది కాబట్టి పరిస్థితి ఇలా అయిందని బుకాయిస్తూ... తప్పుడు వార్తలు రాస్తే కఠిన చర్యలు తప్పవని బెదిరిస్తూ హుంకరింపులకు దిగారు.
ఎల్లో మీడియా... సేమ్ టు ‘షేమ్’
చంద్రబాబుకు కొమ్ముకాసే ఎల్లో మీడియా వైఖరి షరా మామూలే. ఉభయగోదావరి వరదల్లో ఎక్కడో ఒకరికో, ఇద్దరికో సాయం అందకపోతే ఆ ఒక్కరి గురించే పేజీలకు పేజీలు వండేసి అబద్ధాలతో నాటి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన ఎల్లో మీడియా... ఇప్పుడు కూడా ముందస్తు సమాచారం ఉన్నా అధికార యంత్రాంగం తగు చర్యలు చేపట్టలేకపోయిందంటూ... అనుకున్న విధంగా సహాయక చర్యలు లేవంటూ సుతిమెత్తగా సన్నాయి నొక్కులు నొక్కింది.
ముఖ్యమంత్రి కలెక్టరేట్లో బస చేసిన వార్తలకే పెద్దపీట. అక్కడ బస చేయటం వల్ల ఉపయోగం ఏంటన్నది దుర్గమ్మకెరక. బాధితుల్లో ఎవరిని పలకరించినా... తమ చెంతకు ఎవరూ రాలేదని, ఎలాంటి సహాయమూ చేయలేదనే చెబుతున్నారు. బోట్లు లేవు.. తరలింపులు లేవు... నీళ్లు లేవు.. ఆహారం లేదు.. సహాయ సామగ్రి లేవు. అసలు ప్రభుత్వ యంత్రాంగమే కనిపించలేదు. ఈ విషయం వరద ప్రాంతాలను సందర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెళ్లినపుడు స్పష్టంగా బయటపడింది. బాధితుల ఆవేదనంతా బయటపడింది. ‘‘ఇప్పటిదాకా మీరు తప్ప ఇక్కడకు వచ్చి మమ్మల్ని పలకరించిన వాళ్లు ఎవ్వరూ లేరు’’ అని విజయవాడలోని సింగ్ నగర్ వాసులు వ్యాఖ్యానించారంటే పరిస్థితి చెప్పకనే తెలుసుకోవచ్చు.
కృష్ణలంక వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్(ఫోటో గ్యాలరీ)
Comments
Please login to add a commentAdd a comment