బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం మృతి | Veteran BJP Senior Leader Chilakamma Rama Chandra Reddy Passed Away | Sakshi
Sakshi News home page

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం మృతి

Jul 4 2021 8:56 AM | Updated on Jul 4 2021 8:56 AM

Veteran BJP Senior Leader Chilakamma Rama Chandra Reddy Passed Away - Sakshi

చిలకం రామచంద్రారెడ్డి

విజయపురం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి (85) శనివారం తమిళనాడులోని చెన్నై కింగ్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వారం రోజులుగా కరోనా చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. చిత్తూరు జిల్లా విజయపురం మండలం మంగళం గ్రామంలో చిలకం నర్సారెడ్డి, శంకరమ్మ దంపతులకు జన్మించిన రామచంద్రారెడ్డికి లక్ష్మమ్మతో వివాహం జరిగింది.

ఆయనకు కుమారుడు ఈశ్వర్‌ప్రసాద్, కుమార్తెలు దాక్షాయణి, మాధవి ఉన్నారు. 1959–64 వరకు మంగళం సర్పంచ్‌గా, 1982–87 వరకు పిచ్చాటూరు సమితి అధ్యక్షుడిగా, 1999–2004 వరకు ఉమ్మడి ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా, రైతు కమిషన్‌ మెంబర్‌గా విధులు నిర్వహించారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే ఆర్కే రోజా, మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి,తదితరులు సంతాపం తెలిపారు. ఆదివారం మంగళంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement