అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి | Vellampalli Srinivasa Rao Laid Foundation Stone To Development Works In Vijayawada | Sakshi
Sakshi News home page

ప్రణబ్‌ ముఖర్జీ మృతికి సంతాపం​ తెలిపిన మంత్రి

Sep 1 2020 1:41 PM | Updated on Sep 1 2020 2:52 PM

Vellampalli Srinivasa Rao Laid Foundation Stone To Development Works In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: పట్టణంలో పశ్చిమ నియోజకవర్గంలోని 34వ డివిజనలో 2.20 లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. అనం‍తరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించారని చెప్పారు. కరోనా వంటి విపత్కర సమయంలో కూడా అభివృద్ధికి ఎలాంటి‌ ఆటంకం కలగలేదన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్‌లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 90 శాతం సంక్షేమ పథకాలను ఆయన ప్రజల వద్దకే తీసుకువచ్చారన్నారని ఆయన తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని జూమ్ ద్వారా కులాలను, మతాలను రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇకనైన కుళ్ళు రాజకీయాలు మానుకోవాలని, ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement