Unseasonal rains: ఏపీలో భారీ వర్షాలు | Unseasonal Rains 2023: IMD Alert AP Telangana Heavy Rains | Sakshi
Sakshi News home page

ఏపీలో భారీ వర్షాలు.. మరో నాలుగు రోజులు అకాల వర్షం, వడగండ్ల ప్రభావమే!

Mar 18 2023 6:24 PM | Updated on Mar 18 2023 6:39 PM

Unseasonal Rains 2023: IMD Alert AP Telangana Heavy Rains - Sakshi

దట్టమైన మేఘాలు అలుముకుని సాయంత్రం ఐదు గంటలకే చీకటి కమ్మేసింది..

సాక్షి, విజయవాడ:  ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను కారు మబ్బులు కమ్మేశాయి. అకాల వర్షాలు, వడగండ్ల వానతో  ఇరు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. శనివారం సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తున్నాయి. 

ఏపీలోని పలు జిల్లాలను దట్టమైన మేఘాలు అలుముకుని సాయంత్రం ఐదు గంటలకే చీకటి కమ్మేసింది. కృష్ణా, ఎన్టీఆర్‌, విశాఖపట్నం, నెల్లూరు.. ఇలా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు, గుంటూరులలో వడగండ్ల వాన కురుస్తోంది. ఇక విశాఖ వర్షం నేపథ్యంలో.. రేపటి(ఆదివారం) మ్యాచ్‌కి అంతరాయం కలగొచ్చనే ఆందోళన క్రికెట్‌ అభిమానుల్లో నెలకొంది. 

మరోవైపు ఏపీతో పాటు తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు వర్ష ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

ఇదీ చదవండి: వివక్ష లేదు.. మంత్రి వేణు ప్రకటన

Advertisement
 
Advertisement
Advertisement