TTD Releases White Paper On Srivari's Assets - Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ

Nov 5 2022 2:41 PM | Updated on Nov 5 2022 8:38 PM

 TTD Released white Paper On Srivaris Assets - Sakshi

సాక్షి, తిరుమల:  శ్రీవారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విషయంలో వస్తున్న వదంతులను నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్పష్టం చేసింది. టీటీడీ బోర్డు ఆమోదించిన విధివిధానాల ప్రకారమే బ్యాంకుట్లో డిపాజిట్లు చేసినట్లు టీటీడీ పేర్కొంది. ఈ మేరకు శ్రీవారి ఆస్తులకు సంబంధించి శనివారం శ్వేతపత్రం విడుదల చేసింది టీటీడీ.

దీనిలో భాగంగా శ్రీవారికి మొత్తం బ్యాంకుల్లో రూ. 15, 938 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు తెలిపిన టీటీడీ.. శ్రీవారికి 10,258.37 కేజీల బంగారం ఉన్నట్లు పేర్కొంది.  24 జాతీయ బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌ చేసినట్లు టీటీడీ తెలిపింది. గత మూడేళ్లలో స్వామి వారి నగదు, డిపాజిట్లు భారీగా పెరిగినట్లు తెలిపింది టీటీడీ. 

Advertisement
 
Advertisement
Advertisement