నేషనల్‌ వాటర్‌ హీరో’కు మరో అరుదైన అవార్డు

Tenali Man Bags India Ressonsible Leaders Award 2023 - Sakshi

తెనాలి: ‘నేషనల్‌ వాటర్‌ హీరో’ అవార్డు గ్రహీత, తెనాలికి చెందిన పొదిలి రాజశేఖరరాజు మరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నారు. చత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో శనివారం జరిగిన 2వ ఎన్విరాన్‌మెంటల్‌ సోషల్‌ గవర్నెన్స్‌ ఇండియా సమ్మిట్‌లో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో ఇచ్చే ‘ఇండియా రెస్సాన్సిబుల్‌ లీడర్స్‌ అవార్డు–2023’ను అందుకున్నారు.

ఆయనకు ఇండియా సీఎస్సార్‌ ఫోరం అధ్యక్షుడు డాక్టర్‌ రోషన్‌కుమార్‌ ఈ అవార్డును బహూకరించారు. రాజశేఖరరాజు పలు కార్పొరేట్‌ కంపెనీల్లో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్‌) విభాగాధిపతిగా సేవలందిస్తున్నారు. సేవ చేసే అవకాశాన్ని తనకు భగవంతుడు ప్రసాదించాడని, ఉత్తమంగా చేయటం తన బాధ్యతగా భావించానని ‘సాక్షి’తో రాజశేఖర్‌రాజు చెప్పారు.

చదవండి    మైమ‘రుచి’!.. ప్రతి రెస్టారెంట్‌లోనూ స్పెషల్‌ మెనూ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top