మైమ‘రుచి’!.. ప్రతి రెస్టారెంట్‌లోనూ స్పెషల్‌ మెనూ | Special restaurants in Vijayawada for food lovers | Sakshi
Sakshi News home page

మైమ‘రుచి’!.. ప్రతి రెస్టారెంట్‌లోనూ స్పెషల్‌ మెనూ

Aug 14 2023 3:19 AM | Updated on Aug 14 2023 10:12 AM

Special restaurants in Vijayawada for food lovers - Sakshi

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఆవకాయ, గోంగూర, ముద్దపప్పు, చికెన్‌ బిర్యానీ, పెరుగు అన్నం తినీ తినీ బోర్‌ కొట్టాయా? అయితే మీరు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొగల్రాజపురం ప్రాంతానికి రండి. మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో లభించే స్పెషల్‌ వంటకాలే కాకుండా అరేబియన్, చైనా ప్రాంతాల్లో నోరూరించే రుచులు, గుజరాతీ, రాజస్థాన్, బెంగళూ­రు, హైదరాబాద్‌లో లభించే స్పెషల్‌ డిషెస్‌ సి­ద్ధంగా ఉన్నాయి. కేవలం రొటీన్‌ ఫుడ్‌ తిని బోర్‌ కొట్టిన ఫుడ్‌ లవర్స్‌కు ఈ రెస్టారెంట్ల తలుపులు తెరిచి వేడి వేడి ఆహార పదార్థాలతో ఆహ్వానం పలుకుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.  

ప్రతి రెస్టారెంట్‌లోనూ స్పెషల్‌ మెనూ 
గుజరాతీ వంటకాలను రుచి చూడాలంటే రాజ్‌బోగ్‌ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే. అక్కడ గుజరాత్‌లో లభించే అన్ని రకాల వంటకాలూ సిద్ధంగా ఉంటాయి. రెస్టారెంట్‌లోకి అడుగు పెట్టగానే గుజరాతీ సంప్రదాయం ప్రకారం నుదిట బొట్టుపెట్టి మరీ లోపలకు ఆహ్వానిస్తారు.  
 రెండు తెలుగు రాష్ట్రాల్లో లభించే తెలుగు వంటకాల కోసం యునైటెడ్‌ తెలుగు కిచెన్స్‌(యూటీకే) రెస్టారెంట్‌ తలుపులు తీయాల్సిందే. రాయలసీమ, కోస్తా జిల్లాలు, తెలంగాణ ప్రాంతాల్లో లభించే అన్ని రకాల వంటకాలు ఈ రెస్టారెంట్‌లో నిత్యం సిద్ధంగా ఉంటాయి. 
 అరేబియన్‌ ఫుడ్స్‌ టేస్ట్‌ చేద్దామనుకునే వారి కోసం మొగల్రాజపురంలోనే అరేబియన్‌ రెస్టారెంట్‌ స్వాగతం పలుకుతోంది. ఆరేబియా ప్రాంతంలో కూర్చున్నట్టుగా ఇక్కడ ప్రత్యేకంగా సీట్లను ఏర్పాటు చేశారు. 
ఇక చైనీస్‌ ఫుడ్స్‌ను రుచి చూడాలంటే జ­మ్మిచెట్టు సెంటర్‌ సమీపంలోని నాన్‌కింగ్‌ రెస్టారెంట్‌లోకి అడుగు పెట్టాల్సిందే. 
మొగల్రాజపురం పిన్నమనేని పాలిక్లినిక్‌ రోడ్డులో బెంగళూరు భవన్‌లో ఫేమస్‌ టిఫిన్లు తింటుంటే నిజంగా మనం బెంగళూరులో ఉన్నామా.. అన్న భావన కలుగుతుంది. అలాగే శాంటోస్‌ రెస్టారెంట్‌లో హైదరాబాద్‌ బిర్యానీ, డైనర్స్‌ క్లబ్‌లో కేకులు, ఇస్‌క్రీమ్‌లు ఇలా వివిధ రకాల ఫుడ్స్‌ నిత్యం సిద్ధంగా ఉంటాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement