కోనసీమ జిల్లాలో జాతీయ జెండాకు అవమానం | Tdp Leaders Unveiled The National Flag Upside Down In Konaseema District | Sakshi
Sakshi News home page

కోనసీమ జిల్లాలో జాతీయ జెండాకు అవమానం

Aug 15 2024 12:31 PM | Updated on Aug 15 2024 12:35 PM

Tdp Leaders Unveiled The National Flag Upside Down In Konaseema District

సాక్షి, కోనసీమ జిల్లా:  టీడీపీ నేతల నిర్లక్ష్యం కారణంగా కోనసీమ జిల్లాలో జాతీయజెండాకు అవమానం జరిగింది. 78వ  స్వాతంత్య్య దినోత్సవం సందర్భంగా అమలాపురం రూరల్‌ మండలం గున్నేపల్లి అగ్రహారం పంచాయతీలో జాతీయజెండాను టీడీపీ నేతలు తిరగేసి ఆవిష్కరించారు. దీంతో వేడుకలకు హాజరైన పలువురు టీడీపీ నేతల  తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వాతంత్ర దినోత్సవం.. ఎంతోమంది త్యాగమూర్తుల బలిదానాలకు వారి త్యాగాలకు నిదర్శనం.. అందుకే ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండాను ఎగురవేస్తూ ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఎంతో విశిష్టత కలిగిన మూడు రంగుల జెండా.. పైన కాషాయం, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ.. ఐక్య భావానికి, విజయ గీతానికి సూచికగా నిలుస్తోంది.  అలాంటి జాతీయ జెండాను టీడీపీ నేతలు అవమానించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement