TDP Leader Attacked On News Channel Reporter In Nellore District, Details Inside - Sakshi
Sakshi News home page

టీడీపీ నేత దౌర్జన్యం.. ఛానల్‌ రిపోర్టర్‌పై దాడి!

Apr 7 2023 10:53 AM | Updated on Apr 7 2023 11:54 AM

TDP Leader Attacked On Channel Reporter In Nellore District - Sakshi

సాక్షి, నెల్లూరు: వెంకటాచలంలో టీడీపీ నేత రాజేంద్ర దౌర్జన్యానికి దిగారు. ప్రభుత్వ కార్యక్రమ ఫ్లెక్సీలు కడుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇదేంటని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేశారు. 

వివరాల ప్రకారం.. వడ్డిపాలెంలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి వైఎ‍స్సార్‌సీపీ శ్రేణులు ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్త రాజేంద్ర అనే వ్యక్తి వారికి అడ్డుకుని వాగ్వాదానికి దిగాడు. దీంతో, ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం, ఇది కవర్‌ చేయడానికి వెళ్లిన ఓ ఛానల్‌ రిపోర్టర్‌ వెళ్లడంతో అతడిపై రాజేంద్ర కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో రాజేంద్రను వైఎ‍స్సార్‌సీపీ శ్రేణులు పట్టుకునే ప్రయత్నం చేశారు. 

కానీ, రాజేంద్ర దొరక్కపోవడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే, టీడీపీ నేత సోమిరెడ్డి ఆదేశాలతోనే టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement