మరో టీడీపీ కామాంధుడు.. మహిళకు లైంగిక వేధింపులు | TDP Leader Assaults Woman In Anantapur District | Sakshi
Sakshi News home page

మరో టీడీపీ కామాంధుడు.. మహిళకు లైంగిక వేధింపులు

Sep 6 2024 11:48 AM | Updated on Sep 6 2024 1:47 PM

TDP Leader Assaults Woman In Anantapur District

అధికారాన్ని అడ్డం పెట్టకుని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చిది.

సాక్షి, అనంతపురం జిల్లా: అధికారాన్ని అడ్డం పెట్టకుని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చిది. అనంతపురం జిల్లా శింగనమల మండలంలో టీడీపీ నేత  శ్రీనివాస్ నాయుడు లైంగిక వేధింపులు బయటపడ్డాయి. ఉపాధి హామీ మహిళా కూలీలకు డబ్బుతో ఎర వేస్తున్న టీడీపీ నేత లైంగిక వేధింపుల ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

3 లక్షలు లోన్‌ ఇప్పిస్తా.. బయటకు రావడానికి వీలు అవుతుందా?. ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా.. తన కోరిక తీర్చాలంటూ శ్రీనివాస్‌ నాయుడు వేధింపులకు గురిచేశాడు. టీడీపీ నేతపై పోలీసులకు బాధితతురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement