Nov 21st: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

TDP Chandrababu Cases Petitions And Political Updates 21 November - Sakshi

సానుభూతి వ్యూహాన్ని పక్కనబెట్టిన తెలుగుదేశం

ఇక చంద్రబాబు పూర్తి దృష్టి ఏపీ రాజకీయాలు

చంద్రబాబు జైలు ఎపిసోడ్‌తో తేలిపోయిన లోకేష్‌ సామర్థ్యం

పవన్‌ కళ్యాణే దిక్కు అని నిర్ణయించుకున్న చంద్రబాబు

TDP Chandrababu Cases Petitions And Political Updates..

4:45PM, Nov 21, 2023
ఫైబర్‌నెట్‌ కేసులో ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఏసీబీ కోర్టు ఆదేశం

 • చంద్రబాబు సన్నితులైన ఏడుగురు నిందితులకు చెందిన రూ. 114 కోట్ల ఆస్తుల జప్తునకు సీఐడీని ఆదేశించిన ఏసీబీ కోర్టు
 • రూ. 114 కోట్ల ఆస్తుల జప్తు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌
 • ఇప్పటికే సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం
 • టెరాసాఫ్ట్‌ కంపెనీతో పాటు మరో నిందితుడి ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌
 • ఫైబర్‌నెట్‌ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోయమయ్యాయని ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు
 • ఈ కేసులో ఏ-1గా వేమూరి హరికృష్ణ, ఏ-11గా టెర్రా సాఫ్ట్‌ ఎండీ తుమ్మల గోపీచంద్‌, ఏ-25గా చంద్రబాబు పేర్లు
 • తుమ్మలు గోపీచంద్‌, ఆయన భాయ్య పావని పేర్లపై హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీ, యూసఫ్‌గూడ, జూబ్లిహిల్స్‌ కాలనీ, చిన్న మంగళారంలో ఇళ్లు
 • రంగారెడ్డి జిల్లాలోని వ్యవసాయ క్షేత్రాలు అటాచ్‌
 • ఈ కుంభకోణంలో నిందితులైన నెటాప్స్‌, ఫైబర్‌ సొల్యూషన్స్‌ డైరెక్టర్‌ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరులో ఇంటి స్థలం, విశాఖ కిర్లంపూడి లే అవుట్‌లోని ఒక ప్లాట్‌ అటాచ్‌

4:08PM, Nov 21, 2023

 • చంద్రబాబు కేసులో ఏపీ హైకోర్టు తీర్పు న్యాయ సమ్మతంగా లేదు
 • పొన్నవలు సుధాకర్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్  జనరల్
 • స్కిల్ స్కాం కుంభకోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది
 • బెయిల్ స్టేజ్ లోనే సాక్షాలు లేవని  ఏపీ హైకోర్ట్ అనడం సరైనది కాదు
 • హైకోర్టు తన పరిధిని అతిక్రమించింది
 • ఇది అసాధారణమైన విషయం 
 • చార్జీ షీట్ వేయనంతవరకు దర్యాప్తు కొనసాగుతున్నట్లే
 • టిడిపి అకౌంట్‌లో ఊరు పేరు లేని నగదు జమయింది 
 • దీనిపైన దర్యాప్తు జరుగుతోంది
 • ఈడీ కూడా ఈ కేసులో దర్యాప్తు చేస్తోంది
 • సిమెన్స్ అంతర్గత నివేదికలు,  ఫోరెన్సిక్ ఆడిట్లో అక్రమాలు బయటపడ్డాయి 
 • ఏపీ హైకోర్టు ఈ కేసులో మినీ ట్రయల్ జరిపింది
 • మినీ ట్రైలర్ నిర్వహించడం చట్ట విరుద్ధం
 • ఇది సామాజిక ఆర్థిక కుంభకోణం
 • 371 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచేశారు

3:50PM, Nov 21, 2023

ఎల్లో గ్యాంగ్‌పై సజ్జల ఫైర్‌

 • పచ్చ దొంగల ముఠా పట్టపగలు ఇళ్లలోకి చొరబడుతోంది
 • ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
 • అంతర్జాతీయ దొంగల ముఠాలకు ఆ పార్టీ ఏ మాత్రం తీసిపోదు
 • దొంగల పార్టీ అధికారంలోకివస్తే ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో
 • పచ్చ దొంగల ముఠా ఊళ్ల మీద పడుతోంది
 • ఇళ్లల్లోకి చొరబడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
 • మోసం చేయడంలో కొత్త టెక్నిక్స్‌ టీడీపీకి బాగా తెలుసు
 • చంద్రబాబుకు అమలు చేయాలనే ఉద్దేశం లేని హామీలు ఇచ్చారు
 • హామీల అమలేదని అడుగుతారని వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు
 • ఓటర్‌ ఐడీకార్డు తీసుకుని ఎన్నికల చట్టాలను ఉల్లంఘిస్తున్నారు
 • వ్యక్తిగత సమాచారం సేకరించి వారి ప్రైవసీకి భంగం కల్గిస్తున్నారు
 • రాత పూర్వకంగా ఇచ్చేదే మేనిఫెస్టో.. మరి దీనిని ఏమంటారు
 • 5 కోట్ల మంది ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు
 • చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తూ నిలువు దోపిడీకి ప్రయత్నాలు చేస్తున్నారు
 • లెక్కవేసి టీడీపీ ప్రలోభాలకు గురిచేస్తోందిసిస్టమ్‌లోకి అనుమతి లేకండా చొరబడి వ్యక్తిగత డేటాను టీడీపీ సేకరించింది
 • ఈ డేటాతో టీడీపీ బ్లాక్‌ మెయిల్‌ చేయొచ్చు.. ఏమైనా చేయొచ్చు
 • ఇంత డబ్బులు వస్తాయని చెబుతున్న వీళ్లను ఏ చట్టం ప్రకారం శిక్షించాలి
 • అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఓటర్లను ప్రలోభానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు
 • మనిషికి ఏవైతే ఉండకూడదో అన్ని చంద్రబాబుకు ఉన్నాయి
 • చంద్రబాబు ఆలోచనలు ఎంత వికృతమైనవో దీని ద్వారా తెలుస్తోంది
 • ఓట్లను తొలగిస్తున్నారని ఈనాడు అసత్య వార్తలు
 • అడ్డదారుల్లో అధికారంలోకిరావడానికి ఓట్లను గత టీడీపీ ప్రభుత్వం తొలగించింది
 • ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈనాడు తప్పుడు కథనాలు

3:42PM, Nov 21, 2023

చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టులో సవాల్‌

 • చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌
 • ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని పిటిషన్‌
 • ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని  వినతి
 • దర్యాప్తు దశలోనే కేసులో సాక్షాలు లేవని చెప్పడం హైకోర్టు తన పరిధిని అతిక్రమించడమేనని పిటిషన్‌లో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం
 • ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణమే నిలిపివేయాలని వినతి 

3:40PM, Nov 21, 2023

 • గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ
 • విచారణను రేపటికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

2:44PM, Nov 21, 2023

విజయవాడ:

బెయిల్ ఆర్డర్‌లో మినీ ట్రయల్స్ చేయడం ఆశ్చర్యం‌ కలిగిస్తోంది

 • హైకోర్టు సీనియర్ న్యాయవాది కోటంరాజు వెంకటేశ్ శర్మ
 • చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో నిర్దోషిగా బయటపడలేదు
 • చంద్రబాబుకి అనారోగ్య కారణాలతోనే బెయిల్ మాత్రమే వచ్చింది
 • కేసు ఐఓ ఎపుడూ పిలిచినా చంద్రబాబు వెళ్లాల్సిందే....అడిగిన డాక్యుమెంట్లు ఇవ్చాల్సిందే
 • సుప్రీంకోర్టు సూచనలని హైకోర్టు అతిక్రమించింది
 • బెయిల్ ఆర్డర్‌లో మినీ ట్రయల్స్ చేయడం ఆశ్చర్యం‌ కలిగిస్తోంది
 • బెయిల్ ఆర్డర్‌లో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించినట్లు కనపడుతోంది
 • బెయిల్ ఆర్డర్ సంక్షిప్తంగా ఉండాలని పలు కేసులలో సుప్రీంకోర్టు ఉదహరించింది
 • పార్టీ ఖాతాలలోకి నిదుల మల్లింపుపై సీఐడీ విచారణకి టిడిపి సహకరించటం లేదు
 • విచారణ జరుగుతుండగానే టిడిపి ఖాతాల నిధులపై కోర్టు ఒక నిర్ణయానికి ఎలా వస్తుంది
 • సీఐడీ వాదనలని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు
 • క్రింది కోర్టులో ట్రయల్ సమయంలో నిర్దారించాల్సిన విషయాలని హైకోర్టు బెయిల్ సమయంలో ఎలా ఇచ్చింది
 • సీఐడీ సుప్రీంకోర్టులో అపీల్‌కి వెళ్తోంది
 • సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ పై విచారణ జరుగుతుంది
 • సాక్షులని చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు
 • ఐటి నోటీసులు అందుకోగానే మనోజ్ పార్ధసాని, పిఎ పెండ్యాల శ్రీనివాస్ లు పారిపోయారు
 • చంద్రబాబు చుట్టూ ఉన్నవాళ్లే ఎందుకు పారిపోతున్నారు...మిగతా వాళ్లు ఎందుకు పరారీలో లేరు
 • వారు పారిపోతే లబ్ది పొందేది చంద్రబాబే
 • ఈ విషయాలని సీఐడీ కోర్టు ముందు ఆధారాలుంచినా ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు
 • సుప్రీంకోర్టు గైడ్ లైన్స్‌ని హైకోర్టు పట్టించుకోలేదు
 • తమ ఆదేశాలని పట్టించుకోకపోవడంపై సుప్రీంకోర్టు విచారిస్తుంది
 • ఈ విషయంలో సీఐడీకి సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు ఉంటుందనుకుంటున్నా
 • గతంలో అనేక కేసులలో బెయిల్ ఇచ్చిన సందర్బంలో ముద్దాయిలకి కండీషన్స్పై ఇచ్చేవారు
 • నిందితుల పాస్ పోర్ట్ సీజ్ చేసేవారు ...ఐఓ ముందు వారానికి ఒకసారో...రెండుసార్లో హాజరవ్వాలని ఇచ్చేవారు
 • చంద్రబాబుకి బెయిల్ ఇచ్చే సమయంలో ఎటువంటి కండీషన్స్ పెట్టలేదు
 • పిటీషన్ లో పేర్కొనని వాటిపై కూడా హైకోర్టు స్పందించడం ఆశ్చర్యం‌ కలిగిస్తోంది

1:30 PM, Nov 21, 2023
నారా చంద్రబాబు నాయుడు.. ఏ కేసు.? స్టేటస్‌ ఏంటీ?

కేసు : స్కిల్ స్కాం @ హైకోర్టు
స్టేటస్‌ : నవంబర్‌ 20న బెయిల్‌ ఇచ్చిన హైకోర్టు
వివరణ :  నవంబర్‌ 28వరకు చంద్రబాబుపై ఆంక్షలు, చికిత్స చేయించుకున్న వివరాలు సమర్పించాలని ఆదేశం

కేసు : స్కిల్ స్కాం @ సుప్రీంకోర్టు
అంశం : క్వాష్‌ పిటిషన్‌
స్టేటస్‌ : సుప్రీంకోర్టులో పెండింగ్‌
వివరణ : ఈ నెలాఖరుకు తీర్పు వచ్చే అవకాశం

కేసు : ఇసుక కుంభకోణం @ హైకోర్టు
అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్‌ 22కి తదుపరి విచారణ వాయిదా
 
కేసు : ఫైబర్‌ నెట్‌ పేరిట నిధుల దోపిడి
అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌ : సుప్రీంకోర్టులో పెండింగ్‌
వివరణ : నవంబర్‌ 30కి తదుపరి విచారణ వాయిదా

కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు
అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌ : మంజూరు చేసిన హైకోర్టు
వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు

కేసు : ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అక్రమాల కేసు
అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్‌ 22కి వాయిదా పడ్డ కేసు
 
కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు
అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్‌ 24కి వాయిదా పడ్డ విచారణ

1:28 PM, Nov 21, 2023
మద్యం కేసు : కొల్లు పిటిషన్‌
►ఏపీ హైకోర్టులో కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ
►పాస్ ఓవర్ అడిగిన పిటిషనర్ తరఫున న్యాయవాదులు
►లంచ్ బ్రేక్ తర్వాత విచారించనున్న హైకోర్టు
►మద్యం కుంభకోణంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కొల్లు పిటిషన్‌

1:23 PM, Nov 21, 2023
బాబు బెయిల్‌పై విచారణ వాయిదా
►మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ వాయిదా
►విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన ఏపి హైకోర్టు
►స్కిల్‌ స్కాంలో ఇప్పటికే చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

1:22 PM, Nov 21, 2023
ఢిల్లీకి AP CID టీం
►సుప్రీంకోర్టులో పిటిషన్‌ కోసం ఢిల్లీకి ఏపీ సీఐడీ లీగల్ టీమ్
►ఢిల్లీ చేరుకున్న అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
►చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న CID

1:12 PM, Nov 21, 2023
బీటెక్‌ రవి బెయిల్‌ @ కడప
►తెలుగుదేశం నేత బీటెక్ రవి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
►బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేసిన కడప కోర్టు
►కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తెదేపా నేత బీటెక్ రవి
►ఈనెల 14న బీటెక్ రవిని అరెస్టు చేసిన వల్లూరు పోలీసులు
►లోకేష్‌ పర్యటన సందర్భంగా పోలీసులపై బీటెక్‌ రవి దౌర్జన్యం
►కడప ఎయిర్‌పోర్టు ముందు ASIపై బీటెక్‌ రవి దాడి
►పది నెలలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న బీటెక్‌ రవి

12:22 PM, Nov 21, 2023
జడ్జిలపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులపై హైకోర్టులో విచారణ
►చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత జడ్జిలపై అసభ్యకర పోస్టులపై విచారణ
►క్రిమినల్‌ కంటెంప్ట్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు
►తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా

12:04 PM, Nov 21, 2023
చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌  అలైన్‌మెంట్‌ స్కాంలో బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌
►బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
►బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 23కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

10:36 AM, Nov 21, 2023
జైలు ఎపిసోడ్‌ నేర్పిన పాఠాలేంటీ?
► చంద్రబాబుకు ఎన్నో విషయాలపై స్పష్టత ఇచ్చిన జైలు జీవితం
► పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం విషయంలో ఉన్నదంతా డొల్లే
► ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఉన్నట్టు, చంద్రబాబుకు మరొకరు లేరన్న విషయంపై స్పష్టత
► లోకేష్‌పై, చినబాబు నాయకత్వంపై ఇప్పటివరకు పెట్టుకున్నవన్ని భ్రమలే
► పార్టీలో ఉన్న సీనియర్ల వల్ల ఫలితం శూన్యం
► అచ్చెన్న, యనమల, గోరంట్ల, సోమిరెడ్డి, పయ్యావుల, కోట్ల.. పేరుకే సీనియర్లు
► కష్టకాలంలో ఏ సీనియర్‌ కూడా పార్టీని నడిపించే సత్తా లేదని సుస్పష్టం
► పార్టీ సీనియర్లలో కొరవడిన సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌
► పవన్‌ కళ్యాణ్‌ను నమ్ముకోవడం పార్టీ దౌర్భాగ్యం అని తేలినా.. ఏమి చేయలేని వైనం
► పార్టీ ఆందోళన కార్యక్రమాల్లో ఎవరూ రుపాయి ఖర్చు పెట్టలేదని క్లారిటీ
► మీడియాలో కనిపించే మై"కింగ్‌"లు వేరు, క్షేత్రస్థాయిలో పని చేసే వారు వేరు అన్నదానిపై స్పష్టత
► కిం.. కర్తవ్యం.? ఏం చేస్తే పార్టీ పట్టాలెక్కుతుంది? చంద్రబాబు మంత్రాంగాలు

10:15 AM, Nov 21, 2023
ఫైబర్‌ నెట్‌ స్కాంలో నేడు ఏసీబీ కోర్టులో విచారణ
ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్ కోరుతూ సీఐడీ పిటిషన్‌పై నేడు విచారణ
నిన్న ఏసీబీ జడ్జి సెలవుతో విచారణ నేటికి వాయిదా
ఫైబర్ నెట్ కుంభకోణంలో నిందితులకి సంబంధించిన ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలని సీఐడీ ప్రతిపాదన
ఇప్పటికే సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం
అనుమతి కోసం ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సీఐడీ
టెరాసాఫ్ట్‌ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ 
ఫైబర్ నెట్ కుంభకోణంలో 114 కోట్లు దుర్వినియోగమయ్యామని ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు
ఈ కేసులో ఏ1గా వేమూరి హరికృష్ణ, ఏ-11గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్, ఏ -25గా చంద్రబాబు పేర్లు

09:28 AM, Nov 21, 2023
చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ
ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ స్కాంలో బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

09:15 AM, Nov 21, 2023
చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించింది: ఏపీ ప్రభుత్వం
పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించింది
హైకోర్టు తన అధికార పరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసింది
దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ నేతలు, ప్రతినిధులు నిరంతరం రాళ్లు వేస్తూనే ఉన్నారు
సీఐడీ కోరిన సమాచారాన్ని ఇప్పటివరకు టీడీపీ ఇవ్వలేదు
కేసుల మూలల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనడం ట్రయల్‌ కోర్టు అధికారాలను బెయిల్‌ దశలోనే న్యాయపరిధిని దాటడమే అవుతుంది
బెయిల్‌ సందర్భంగా సీఐడీ అభ్యంతరాలపై తిరిగి పిటిషనర్‌ ఎలాంటి వాదనలు చేయలేదు

08:11 AM, Nov 21, 2023
స్కిల్‌ స్కాంలో చంద్రబాబుకు శిక్షపడటం ఖాయం: సజ్జల
మెడికల్‌ బెయిల్‌ను రెగ్యులర్‌ బెయిల్‌గా మార్చితే సత్యం గెలిచినట్లా? 
స్కిల్‌ స్కాం కేసులో బెయిల్‌ వచ్చినంతమాత్రాన చంద్రబాబు నిర్దోషి కాడు 
చంద్రబాబు స్కాం చేసినట్టు ఆధారాలు ఉన్నాయి.. సూత్రధారి ఆయనే 
బెయిలిస్తేనే కేసు కొట్టేసినట్లుగా సంబరాలు చేసుకుంటారా? 

07:53 AM, Nov 21, 2023
స్కిల్‌ స్కాంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలున్నాయి
ఆయన కార్యాలయమే అంతా చేసింది
కేబినెట్‌ ఆమోదం లేకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు 
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ – ఇన్నోవేషన్‌ శాఖల ఏర్పాటూ నిబంధనలకు విరుద్ధమే 
జీవోకు విరుద్ధంగా ఒప్పందం
ప్రాజెక్టు వ్యయంలో 90% సీమెన్స్‌ – డిజైన్‌ టెక్‌ భరిస్తాయన్న జీవో 
ఈ అంశం ఆ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందంలో లేదు 
కంపెనీలు నిధులివ్వనందున ప్రభుత్వ వాటా విడుదల చేయొద్దన్న అధికారులు 
ఆ  అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ నిధుల విడుదల 
షెల్‌ కంపెనీల ద్వారా తరలింపు 
స్పష్టం చేసిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం 
గత నెల చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరిస్తూ కీలక వ్యాఖ్యలు

07:10 AM, Nov 21, 2023
స్కిల్‌ కుంభకోణంలో.. చంద్రబాబుకు బెయిల్‌
చికిత్స కోసం ఇచ్చిన తాత్కాలిక బెయిల్‌ స్థానంలో రెగ్యులర్‌ బెయిలు
తాత్కాలిక బెయిలు షరతులు...ఈ నెల 29 నుంచి సడలింపు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మల్లికార్జునరావు ఉత్తర్వులు
నిధుల విడుదలకు ఆదేశాలిచ్చినంత మాత్రాన బాబు నేరం చేసినట్లు కాదు
అలాగే, నిధులు మళ్లించారనటానికి కూడా ఆధారాల్లేవని వ్యాఖ్యలు
తాను ఈ దశలో ‘మినీ ట్రయల్‌’ నిర్వహించడం లేదని చెప్పిన జడ్జి
కానీ పూర్తి విచారణ జరిపేసినట్లుగా వ్యాఖ్యలపై న్యాయవర్గాల విస్మయం
ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళతామన్న ఏపీ ప్రభుత్వం
వాస్తవానికి బాబుకు కేటరాక్ట్‌ ఆపరేషన్‌ చెయ్యాలనటంతో తాత్కాలిక బెయిలు
ఆ తర్వాత ఆస్పత్రి ఇచ్చిన నివేదికతో.. రెగ్యులర్‌ బెయిలు కోసం పిటిషన్‌
దానిపైనే విచారణ... కేసు మెరిట్స్‌ జోలికి వెళ్లటం లేదని చెప్పిన జడ్జి
కానీ బాబు పాత్రపై కీలక వ్యాఖ్యలు చేయటంతో న్యాయవర్గాల విస్మయం
కేసు మెరిట్స్‌పై విచారణ జరిపి... బాబు పాత్రకు ఆధారాలున్నాయని స్పష్టంగా తేల్చిన ఏసీబీ కోర్టు
దానిపై తదుపరి విచారణను కొనసాగిస్తున్న సీఐడీ... పలు కీలక ఆధారాలు లభ్యం
ఈ దశలో విచారణ పూర్తికాకముందే హైకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు!!
బెయిల్‌ దశలో హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని అభిప్రాయపడ్డ ప్రభుత్వం
ఈ విషయంలో ‘సుప్రీం’ కొలమానాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందని వ్యాఖ్య  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top